సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీల డుమ్మా

ABN , First Publish Date - 2022-10-02T05:09:17+05:30 IST

మల్యాల మండల పరిషత్‌ సర్వసభ్య సమావే శానికి 14మంది ఎంపీటీసీలకు గాను కేవలం అయిదుగురు మాత్రమే వచ్చారు. ఎంపీపీ మిట్టపల్లి విమల అధ్యక్షతన శనివారం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ విమల, ముత్యంపేట, రాజారం, పోతారం ఎంపీటీసీలు సామల రేణుక, మారంపల్లి నర్సవ్వ, కొల్లూరి గంగాధర్‌ హాజరు కాగా లంబాడిపల్లి ఎంపీటీసీ కట్కూరి నవత హాజరైనట్లు సంతకం చేసి వెళ్లారు.

సర్వసభ్య సమావేశానికి ఎంపీటీసీల డుమ్మా
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే

మల్యాల, అక్టోబరు 1: మల్యాల మండల పరిషత్‌ సర్వసభ్య సమావే శానికి 14మంది ఎంపీటీసీలకు గాను కేవలం అయిదుగురు మాత్రమే  వచ్చారు. ఎంపీపీ మిట్టపల్లి విమల అధ్యక్షతన శనివారం మండల పరిషత్‌ సర్వసభ్య సమావేశం జరిగింది. ఎంపీపీ విమల, ముత్యంపేట, రాజారం, పోతారం ఎంపీటీసీలు సామల రేణుక, మారంపల్లి నర్సవ్వ, కొల్లూరి గంగాధర్‌ హాజరు కాగా లంబాడిపల్లి ఎంపీటీసీ కట్కూరి నవత హాజరైనట్లు సంతకం చేసి వెళ్లారు. టీఆర్‌ఎస్‌కు చెందిన వైస్‌ ఎంపీపీ పోతాని రవి, ఎంపీటీసీలు సఫీయాభేగం, పద్మ, ఆగంతపు రవళీ, బీజేపీ సభ్యులు రాచర్ల రమేశ్‌, సంగని రవి, ముదుగంటి వనిత, కాంగ్రెస్‌ ఎంపీటీసీలు దొంగ అనిత, మరాఠి సంజన హాజరు కాలేదు. తమను ఉత్సవ విగ్రహాలుగా చేస్తూ సర్వసభ్య సమావేశాలకు తప్ప ఇతరాత్ర వాటికి పరిగణలోకి తీసుకోవడం లేదని, నిధుల కేటాయింపులో వివక్షతో తాము గ్రామాల్లో ఎలాంటి అభివృద్ధి చేయలేక ఇబ్బందులు పడుతున్నా మంటూ మండల ఎంపీటీసీల ఫోరం ఆధ్వర్యంలో సర్వసభ్య సమావేశా నికి గైర్హాజరు కావాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. కొందరు వ్యక్తిగ త కారణాలతో, మిగితా వారు ఫోరం నిర్ణయం మేరకు గైర్హజరైనట్లు చర్చించుకుంటున్నారు. సమావేశం వాయిదాతో తమ నిరసనను మండ ల వాసులకు తెలియజేయాలని నిర్ణయించుకోగా సరిపడా సభ్యులు హాజరవడంతో సమావేశం జరిగింది. ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమం కొనసాగుతుందని అన్నారు. మిషన్‌భగీరథ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదే శించారు. కాగా సమావేశం మొక్కుబడిగా పూర్తి చేశారు. ఈ సమావే శంలో జడ్పీటీసీ కొంపల్కుల రామ్మోహన్‌రావు, ఎంపీడీవో శైలజారాణీ, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్‌ పాల్గొన్నారు. 


Read more