‘ప్రజావాణి’ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దు

ABN , First Publish Date - 2022-10-18T05:05:19+05:30 IST

‘ప్రజావాణి’లో వచ్చే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయ కుండా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంగీత సత్యనా రాయణ సంబంధిత అధికారులకు సూచించారు.

‘ప్రజావాణి’ దరఖాస్తులను నిర్లక్ష్యం చేయొద్దు
దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ సంగీతసత్యనారాయణ

- కలెక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లిటౌన్‌ అక్టోబరు 17: ‘ప్రజావాణి’లో వచ్చే దరఖాస్తులను నిర్లక్ష్యం చేయ కుండా వెంటనే పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ సంగీత సత్యనా రాయణ సంబంధిత అధికారులకు సూచించారు. సోమవారం ప్రజావాణి నిర్వహిం చిన అనంతరం ఆమె మాట్లాడారు. దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచి బాధితులను ఇబ్బందులకు గురిచేస్తే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. దరఖాస్తుల తిరస్కరణకు గల కారణాలు వివరించాలని సూచించారు. మొత్తం 33 దరఖాస్తులు వచ్చాయని, ఇందులో భూ సంబంధిత, పింఛన్ల మంజూరు, ఉపాధి తదితర సమస్యలపై దరఖాస్తులు వచ్చాయన్నారు. మొత్తం దరఖాస్తులను సంబం ధిత అధికారులకు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేసినట్లు పేర్కొన్నారు. 

Updated Date - 2022-10-18T05:05:19+05:30 IST