సర్దుబాటుపై అసంతృప్తి
ABN , First Publish Date - 2022-08-10T06:07:40+05:30 IST
రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వీఆర్వోల సర్దుబాటుపై జిల్లా వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 22 నెలల క్రి తమే వీఆర్వో వ్యవస్ధను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రెవెన్యూ మినహా ఇతర శాఖలకు వీఆర్వోల కేటాయింపు
జీవో.నెం. 121పై అసహనం
ధరణి సమస్యలు, విధుల నిర్వహణపై వీడని సందిగ్ధం
జగిత్యాల అర్బన్, ఆగస్ట్టు 9: రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వీఆర్వోల సర్దుబాటుపై జిల్లా వ్యాప్తంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. 22 నెలల క్రి తమే వీఆర్వో వ్యవస్ధను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. అప్పటి నుంచి ఆగస్టు 2 వరకు ఆనధికారికంగా, జిల్లాలో అధికారులు వే సిన డ్యూటీలు చేసుకుంటూ విధులు నిర్వహిస్తుండగా ఆగస్టు 3న వారి ని జిల్లా అధికార యంత్రాంగం వివిధ శాఖల్లో జీవో నెం. 121 ప్రకారం సర్దుబాటు చేస్తూ ఆర్డర్ కాపీలను అందించింది. దీంతో 22 నెలల నిరీక్షణ కు ఫలితం ఇదేనా అంటూ వీఆర్వోలు ప్రభుత్వ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. చేసేది ఏం లేక విధుల్లో చేరారు. రెండేళ్ల సుదీర్ఘ నిరీక్షణకు ఈ సర్దుబాటు ప్రక్రియ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తెరదించింది.
లక్కీడ్రా ద్వారా శాఖల కేటాయింపు
వీఆర్వోల సర్దుబాటు అంశంలోనైనా తమ డిమాండ్లను పరిగణలోకి తీసుకొని, లక్కీ డ్రా విధానంతో కాకుండా ఆప్షన్, కౌన్సెలింగ్ పద్ధతిలో త మకు శాఖలను కేటాయించాలని కోరినా ఫలితం లేకుండా పోయిందని వీఆర్వోలు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీఆర్వో వ్యవస్థ రద్దుతో త మ గతేంటని వారు ఆవేదన వ్యక్తం చేస్తుండగా, ఉద్యోగాల విషయంలో ప్రభుత్వం భరోసా కల్పిస్తూ నైపుణ్యం ఆధారంగా శాఖల కేటాయిస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది. హామీ మేరకు సుమారు రెండేళ్లు విధుల కో సం వేచి చూసిన వీఆర్వోలు ప్రభుత్వ నిర్లక్ష్యంపై అసహనం వ్యక్తం చే స్తూ గత నెల 25న సహాయ నిరాకరణకు దిగారు. దీనికి తోడు ప్రభు త్వం తెచ్చిన జీవో నెం,121 ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోంద ని వెంటనే జీవోను రద్దు చేయాలని విజ్ఞప్తులు, నిరసనలు తెలిపినా ప్ర భుత్వం పట్టించుకోలేదు.
ఒత్తిడుల నడుమ ఆర్డర్ కాపీలు జారీ..?
జిల్లాలో వీఆర్వోల సర్దుబాటు అంశం జిల్లాలోని వీఆర్వోలను తీవ్ర గందరగోళానికి గురి చేసింది. జీవో.నెం. 121ను వ్యతిరేకిస్తూ తాము సహా య నిరాకరణ చేస్తున్నా ప్రభుత్వం ఒత్తిళ్ల మేరకు ఆర్డర్ కాపీలను చేతిలో పెట్టి బలవంతంగా విధుల్లోకి నెట్టారని వీఆర్వోలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్పష్టత లేని జీవోతో ఉద్యోగం ఎలా చేయాలంటున్నారు. ఈ సర్దు బాటు ప్రక్రియలో జిల్లాలోని 176 మంది వీఆర్వోలను సుమారు 20కి పైగా శాఖల్లో సర్దుబాటు చేసి, అధికారులు ఊపిరి పీల్చుకోగా, శాఖల కేటాయింపులు తమకు తీవ్ర అసంతృప్తిని మిగిల్చాయని వీఆర్వోలు మ దనపడుతున్నారు. వీఆర్వోలను గత సెప్టెంబర్ 2020లో వీఆర్వో వ్యవ స్ధను రద్దు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించినప్పటి నుంచి జాబ్‌చార్ట్ ఆధారంగా వేతనాలను అందించారు. కేవలం కేటాయించిన శాఖల్లో క్యాడ ర్ ఉద్యోగులుగా ఉండనున్నారు. అయితే నేరుగా వీఆర్వోలుగా ఎంపికైన వారు అర్హతను బట్టి, ఏ క్యాడర్లో చేసేందుకైనా సంసిద్దతగా ఉన్నా, వీ ఆర్ఏలు వీఆర్వోలుగా ప్రమోట్ అయిన వారికి మాత్రం నూతన విధులు ఇబ్బందికరంగా మారాయి. ఇందులో మెజార్టీ వీఆర్వోలకు కంప్యూటర్ పరిజ్ఞానం లేకపోవడం గమనార్హం.
వీఆర్వోల విధులు ఎవరికి?
జిల్లాలో 176 మంది వీఆర్వోలను వివిధ శాఖల్లో సర్దుబాటు చేసిన జిల్లా అధికారులకు ప్రస్తుతం ఓ పెద్ద సమస్య ఎదురైంది. ఇప్పటిదాకా గ్రామ సమాచారం అంతా గుప్పిట్లో పెట్టుకున్న వీఆర్వోలను రెవెన్యూ మినహా ఇతర శాఖల్లోకి బదిలీ చేయడంతో వారి బాధ్యతలు ఎవరికీ అ ప్పగిస్తారనేది అర్థంకాని పరిస్థితి. ఇప్పటికే గ్రామ స్ధాయిలో పనిచేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయ కులు(వీఆర్ఏ) నిరవదిక సమ్మెలోకి వెళ్లగా, గ్రామాల్లో పంచాయితీ కార్యదర్శులు పని ఒత్తిడితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
జీరో సర్వీస్‌పై నెలకొన్న ఆందోళన
15 ఏళ్లుగా వీఆర్వోలుగా గ్రామాల్లో సేవలందిస్తున్న తమపై అవీనీతి ముద్ర వేసిన ప్రభుత్వం, తమ డిమాండ్లు పట్టించుకోకుండా తమకు శా ఖలను కేటాయించడం చట్టవిరుద్దమని వీఆర్వోలు ఆగ్రహం వ్యక్తం చేస్తు న్నారు. తమకు పాత సర్వీస్‌ను కొనసాగించాలని, 12ఏళ్ల సర్వీస్ పూర్తి చే సుకున్న వీఆర్వోలకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, కొత్త ఉద్యోగాల్లో ప్ర మోషన్ ఛానల్‌ను కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. జీవో నెం 121లో ప్రమోషన్, ఇంక్రిమెంట్ ఊసే లేదని, దీంతో ఇన్నేళ్ల సర్వీసు పక్కకు పోయి, కొత్త ఉద్యోగుల మాదిరిగా జీరో సర్వీసు నుంచి తాము విధులు కొనసాగించాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
జీవోలో స్పష్టత లేదు
వేల్పుల రాజయ్య, వీఆర్వోల జేఏసీ జిల్లా కన్వీనర్
ప్రభుత్వం జారీ చేసిన జీవో నెం 121లో స్పష్టత కొరవడింది. సీనియా రిటీ, సర్వీస్ లాంటి వాటికి స్పష్టత లేకుండా జీవో విడుదల చేసి, విధుల్లో చేరమనడం అన్యాయం. ప్రభుత్వం ఇప్పటికైనా జీవో సవరణ చేసి వీఆర్ వోలకు న్యాయం చేయాలి
జీవోను మాత్రమే వ్యతిరేకించాం
అచ్చ సంజీవ్, జిల్లా కో కన్వీనర్, వీఆర్వోల జేఏసీ
తాము ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయలేదు. కేవలం జీవో ను సవరించాలని మాత్రమే నిరసనలు తెలియజేశాం. సీనియారిటీతో పాటు ప్రమోషన్ విషయంలో గందరగోళం నెలకొంది. సర్వీస్ జీరో చేస్తే మా పరిస్థితి ఏంటనేదే మా ఆందోళన. ప్రభుత్వంపై మాకు విశ్వాసం ఉంది. అందుకే ప్రభుత్వానికి వ్యతిరేఖంగా కాకుండా, జీవోకు వ్యతిరేకంగా మాత్రమే పోరాటం చేసినం. న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం
బంద తిరుపతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, వీఆర్వోల జేఏసీ
ఏ శాఖలో కేటాయించినా కనీసం ఆప్షన్ కు అవకాశం ఇవ్వకపోవడం, డ్రా విధానం ద్వారా కౌన్సిలింగ్ ద్వారా సర్దుబాటు జరిగితే కొంత న్యాయం జరిగేదని భావిస్తున్నాం. ప్రభుత్వం స్పందించి వీఆర్వోల సర్వీస్‌రూల్స్, సీనియారిటీపై స్పష్టత ఇస్తుందని ఆశిస్తున్నాం.