పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి

ABN , First Publish Date - 2022-12-30T00:06:14+05:30 IST

‘మన ఊరు మనబడి’ కింద మొదటి విడత చందుర్తి, రుద్రంగి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అన్ని పనులను జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరే ట్‌లో పనుల పురోగతిపై విద్యాశాఖ, ఆర్‌అండ్‌బీ, గ్రామీణ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు.

పాఠశాలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
చెక్కపల్లి గ్రామపంచాయతీలో రికార్డులను పరిశీలిస్తున్న కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల కలెక్టరేట్‌, డిసెంబరు 29: ‘మన ఊరు మనబడి’ కింద మొదటి విడత చందుర్తి, రుద్రంగి మండలాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపట్టిన అన్ని పనులను జనవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరే ట్‌లో పనుల పురోగతిపై విద్యాశాఖ, ఆర్‌అండ్‌బీ, గ్రామీణ అభివృద్ధి అధికారులతో సమీక్ష నిర్వహించారు. చందుర్తి మండలంలో మొదటి విడతలో ‘మన ఊరు మనబడి’ కార్యక్రమం కింద రూ. కోటి 58 లక్షలతో 15 ప్రభుత్వ పాఠ శాలల్లో, రుద్రంగి మండలంలో రూ.36 లక్షలతో 6 ప్రభుత్వ పాఠశాలల్లో సివిల్‌ పనులు చేపట్టా మని పంచాయితీ రాజ్‌ ఇంజనీరింగ్‌ అధికారులు జిల్లా కలెక్టర్‌కు తెలిపారు. స్కూల్‌ వారీగా పనుల పురోగతిని పనుల ప్రారం భానికి ముం దు, తర్వాత ఫొటోలతో కూడిన పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా అధికారులు కలెక్టర్‌కు వివ రించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో ఎప్పటికప్పుడు పనులు పరిశీలి స్తూ సంక్రాంతిలోగా క్వాలిటీతో పనులు పూర్తి చేయాలన్నారు. మోడల్‌ స్కూల్‌లో పెండింగ్‌ పనులను జనవరి 5వ తేదీలోగా పూర్తి చేయాలన్నారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌, జిల్లా విద్యాధికారి డాక్టర్‌ రాధాకిషన్‌, జడ్పీ సీఈవో గౌతమ్‌రెడ్డి, సంబం ధిత ఎంపీడీవోలు, ఎంపీవోలు విద్యాశాఖ అధికా రులు అధికారులు, ిపీఆర్‌ ఇంజనీర్లు ఉన్నారు.

చందుర్తి, రుద్రంగి మండలాలలో దళిత బంధు యూనిట్ల గ్రౌండింగ్‌ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి అధికా రులను ఆదేశించారు. గురువారం చందుర్తి, రుద్రంగి మండలాలలో దళితబంధు పథకం యూనిట్ల గ్రౌండింగ్‌ పురోగతిపై కలెక్టరెట్‌లో అదనపు కలెక్టర్‌ బి సత్యప్రసాద్‌, ఎస్సీ కార్పొ రేషన్‌ ఈడీ వినోద్‌కుమార్‌తో సంబంధిత మండ లాల ఎంపీడీవోలు, ఎంపీవోలతో కలెక్టర్‌ సమీక్షిం చారు. చందుర్తి మండలంలో 12 యూనిట్లు, రుద్రంగి 6 యూనిట్ల గ్రౌండింగ్‌ పురోగతిని అధికారులు జిల్లా కలెక్టర్‌కు వివరించారు.

చెక్కపల్లి సర్పంచ్‌, కార్యదర్శికి కలెక్టర్‌ ప్రశంస

వేములవాడ రూరల్‌ : మండలంలో గురు వారం కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా చెక్కపల్లి, నూక లమర్రి, బాలరాజుపల్లి పాఠశాలల్లో జరుగుతున్న ‘మన ఊరు మనబడి’ పనులను పర్యవేక్షిం చారు. చెక్కపల్లి గ్రామంలో పనుల పురోగతిపై సర్పంచ్‌ అడ్డిక జైపాల్‌రెడ్డి, కార్యదర్శి గడ్డం చందనలను ప్రశంసించారు. నాగాయపల్లిలోని రేషన్‌ షాపును తనిఖీ చేశారు. ఆర్డీవో పవన్‌ కుమార్‌, డీఎస్‌వో జితేందర్‌రెడ్డి, డీఈవో రాధా కృష్ణ, ఎమ్మార్వో శ్రీనివాస్‌ తదితరులున్నారు.

Updated Date - 2022-12-30T00:06:14+05:30 IST

Read more