రీడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఈవో

ABN , First Publish Date - 2022-02-06T05:44:32+05:30 IST

వసంతి పంచ మిని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో రీడ్‌ కార్యక్రమం ప్రారంభమైంది.

రీడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన డీఈవో
ప్రభుత్వ బాలికల పాఠశాలలో మాట్లాడుతున్న డీఈవో మాధవి

పెద్దపల్లి కల్చరల్‌, ఫిబ్రవరి 5 : వసంతి పంచ మిని పురస్కరించుకొని శనివారం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో రీడ్‌ కార్యక్రమం ప్రారంభమైంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లా విద్యాధికారి మాధవి రీడ్‌ కార్యక్రమాన్ని ప్రారంభించారు. చదువు అనందించు, అభివృద్ధి చెందు కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లిలోని జిల్లా పరిషత్‌ బాలికల, ప్రగతినగర్‌ ప్రాథమిక పాఠశాలలో జిల్లా విద్యాధికారి మాధవి చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లా డుతూ వసంత పంచమి మొదలుకొని వంద రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తా మన్నారు. విద్యార్థులు పఠనా నైపుణ్యం పెంచుకొని అనర్గళంగా చదవడం కోసం ఈ కార్యక్రమం రూపొందించారన్నారు. ప్రగతినగర్‌ పాఠశాలలో రీడింగ్‌ రూంను ప్రారంభించడంతో పాటు విద్యార్థులకు వివిధ రకాల కథల పుస్తకాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధి కారి సురేందర్‌కుమార్‌తో పాటు కౌన్సిలర్లు, ఎస్‌ఎంసీ చైర్మన్‌లు, ఉపాధ్యాయులు, సీఆర్‌పీలు, విద్యార్థులు పాల్గొన్నారు. సరస్వతి శిశుమందిర్‌లో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని సరస్వతి విద్యాపీఠం వారు నిర్వహించారు. పెద్దపల్లి ట్రినిటి బిఈడి కళా శాలలో వసంత పంచమి వేడుకలు ఘనంగా నిర్వ హించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సరస్వతి మాత చిత్రపటానికి పూలమాల వేసి అక్షరాభ్యాసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ రజని, బుర్ర తిరుపతిగౌడ్‌, దిలీప్‌ శర్మ, మదుకర్‌, గోపీనాధ్‌, రాము, తిరుపతి, సుజాత తదిత రులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-02-06T05:44:32+05:30 IST