మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన డీఈవో

ABN , First Publish Date - 2022-08-04T05:45:11+05:30 IST

మండలంలోని పెద్దాపూర్‌ గ్రామ ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ ను బుదవారం జిల్లా విద్యాధికారిని మాధవి తనిఖీ చేశారు.

మోడల్‌ స్కూల్‌ను తనిఖీ చేసిన డీఈవో
తొలిమెట్టు శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న డీఈవో మాధవి

జూలపల్లి, ఆగస్టు 3: మండలంలోని పెద్దాపూర్‌ గ్రామ ప్రభుత్వ మోడల్‌ స్కూల్‌ ను బుదవారం జిల్లా విద్యాధికారిని మాధవి తనిఖీ చేశారు. పాఠశాలలో విద్యార్థుల కు అందుతున్న సౌకర్యాలను మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. వసతిగృహాన్ని తనిఖీ చేసి వసతులపై ఆరా తీశారు. విద్యార్థులకు మెరుగైన భోజనాన్ని అందించా లని సూచించారు. అనంతరం తెలుకుంట ప్రభుత్వ పాఠశాలలో నిర్వహిస్తున్న తొలి మెట్టు శిక్షణ శిబిరాన్ని ఆమె తనిఖీ చేశారు. తొలిమెట్టు శిక్షణ శిబిరంలోని ఉపాధ్యా యులతో డీఈవో మాట్లాడుతూ ప్రాథమిక తరగతులకు బోధించే ఉపాధ్యాయులు తరగతి వారి అభ్యాసనపై దృష్టి సారించాలని సూచనలు చేశారు. ఇందులో పలు వురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-04T05:45:11+05:30 IST