ఆర్జీ-2లో రక్షణ పక్షోత్సవాలు ప్రారంభం
ABN , First Publish Date - 2022-10-18T05:08:56+05:30 IST
ఆర్జీ-2 ఏరియాలో 53వ రక్షణ పక్షోత్సవాలను సోమవారం వకీల్‌పల్లె గనిలో జీఎం మనోహర్ ప్రారంభించారు.
యైుటింక్లయిన్‌కాలనీ, అక్టోబరు 17: ఆర్జీ-2 ఏరియాలో 53వ రక్షణ పక్షోత్సవాలను సోమవారం వకీల్‌పల్లె గనిలో జీఎం మనోహర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గని ఆవరణలో జరిగిన కార్యక్రమంలో రక్షణ తనిఖీ మృందం కన్వీనర్ రాజేశ్వర్‌తో కలిసి మాట్లాడారు. ప్రతి ఉద్యోగి రక్షణ పట్ల అవగాహన పెంచుకోవాలని, రక్షణ సూత్రాలను పాటిస్తూ లక్షాలను సాధించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. ప్రమాద రహిత సింగరేణిగా నిలిచేలా ప్రతి ఒక్కరు పాటుపడాల్సిన అవసరం ఉన్నట్టు జీఎం తెలిపారు. ఈనెల 14 నుంచి 20 వరకు సింగరేణి వ్యాప్తంగా రక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎస్‌ఓపీ, సేఫ్టీ మేనేజ్‌మెంట్ ప్లాన్ ప్రకారం సంస్థ నియమ నిబంధ నలను అనుసరించి ప్రమదాలు జరగకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అనంతరం ఉద్యోగులతో రక్షణ ప్రతిజ్ఞ చేయించారు. రక్షణ బృందం గనిలో మూడవ సిమ్ నార్త్ టాప్ సెక్షన్‌లో పని స్థలాలను తనిఖీ చేశారు. రక్షణపై నిర్వహించిన పోటీల విజేతలకు బహుమతులను అందజేశారు. ఈకార్యక్రమంలో పీఓ శ్రీనివాసరెడ్డి, మేనేజర్ రవికిరణ్, గ్రూజ్ ఇంజనీర్ చంద్రశేఖర్, సేఫ్టీ ఆఫీసర్ రాంకుమార్, రక్షణ కమిటీ సభ్యులు సుషితాసాహు, చక్రవర్తి , వెంకటేశం, రవీందర్, శేషు బాబు, కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.