రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్‌

ABN , First Publish Date - 2022-12-15T00:27:21+05:30 IST

రౌడీ షీటర్లు పాత పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రూపేష్‌ హెచ్చరించారు.

రౌడీ షీటర్లకు డీసీపీ కౌన్సెలింగ్‌

పెద్దపల్లిటౌన్‌ డిసెంబరు 14: రౌడీ షీటర్లు పాత పద్ధతి మార్చుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ రూపేష్‌ హెచ్చరించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో బుధవారం రౌడీషీటర్లకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. రౌడీ షీటర్ల జీవన విధానం, వారి కుటంబ స్థితిగతులపై ఆరా తీశారు. అనంతరం రూపేష్‌ మాట్లాడు తూ ప్రజలను ఇబ్బందులకు గురిచేయకుండా సత్ప్రవర్తనతో మెదలాలని సూచించా రు. అనవసరపు వివాదాల్లో తలదూర్చి సెటిల్‌మెంట్లు చేయడం మానుకోవాలన్నా రు. శాంతిభద్రతలు, ప్రజల స్వేచ్ఛ, హక్కులను భంగం కలిగిస్తూ దాడులకు పాల్ప డితే కఠినంగా వ్యవహరిస్తామన్నారు. ఆయినా తీరు మారకపోతే పీడీ యాక్ట్‌లు నమోదు చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఆరు నెలలకొకసారి బైండోవర్‌ చేయ డం వల్ల వారిపై పోలీస్‌ నిఘా ఉంటుందని, కదలికలు, ప్రవర్తన తెలుస్తుందన్నారు. బైండోవర్‌ కాలంలో ఏదైనా నేరానికి పాల్పడితే జరిమానాతో పాటు జైలుశిక్ష పడు తుందన్నారు. చట్టవిరుద్ధంగా వ్యవరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మంచి ప్రవర్తనతో ఉంటే కుటుంబాలు సంతోషంగా ఉంటాయని, దానితో పాటు సమాజం లో గుర్తింపు పెరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ సాదుల సారంగపాణి, సీఐలు ప్రదీప్‌కుమార్‌, ఇంద్రా సేనారెడ్డి, ఎస్సైలు శ్రీనివాస్‌, ఉపేందర్‌ ఉన్నారు.

Updated Date - 2022-12-15T00:27:25+05:30 IST