దళితబంధు అమలు చేయాలి

ABN , First Publish Date - 2022-03-05T05:44:46+05:30 IST

దళితబంధు పథకాన్ని రాష్ట్రం అంతటా అమలు చేయాలని బీజేపీ ఎస్సీ సెల్‌ మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్‌ డిమాండ్‌ చేశారు.

దళితబంధు అమలు చేయాలి
ఇల్లంతకుంటలో రాస్తారోకో చేస్తున్న బీజేపీ నాయకులు

ఇల్లంతకుంట, మార్చి 4: దళితబంధు పథకాన్ని రాష్ట్రం అంతటా అమలు చేయాలని బీజేపీ ఎస్సీ సెల్‌ మండల ప్రధాన కార్యదర్శి మామిడి హరీష్‌ డిమాండ్‌ చేశారు. మండలకేంద్రంలోని ప్రధాన దారిపై శుక్రవారం  రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ దళితుడికి దళితబంధు వర్తింపజేస్తామని సీఎం కేసీఆర్‌ హామీ ఇచ్చి 120 రోజులు గడిచిపోయాయన్నారు. దళితబంధు పథకాన్ని నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు ఎమ్మెల్యే రసమయి ఇప్పించాలని డిమాండ్‌ చేశారు. మండలంలోని చిన్నపల్లెకు దళితబంధు ఇస్తున్నట్లు పేర్కొని మిగతా దళితులకు అన్యాయం చేస్తున్నారన్నారు. మండల అధ్యక్షుడు బెంద్రం తిరుపతిరెడ్డి, ప్రధానకార్యదర్శి సంతోష్‌, నాయకులు  ప్రసన్న, మామిడి హరీష్‌,  రాజు, గజ్జల శ్రీనివాస్‌. ప్రవీణ్‌రెడ్డి, శ్రీకాంత్‌, సాయిప్రసాద్‌రెడ్డి, రాజమల్లు, వర్దన్‌, చింటు, రమేష్‌, రాజయ్య, వెంకటేష్‌, ప్రశాంత్‌, అఖిల్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-03-05T05:44:46+05:30 IST