దళిత బంధు పథకం దేశానికే ఆదర్శం
ABN , First Publish Date - 2022-08-26T06:05:50+05:30 IST
దళిత బంధు పథకం దేశానికే ఆదర్శ మ ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల టౌన్, ఆగస్టు 25 : దళిత బంధు పథకం దేశానికే ఆదర్శ మ ని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్ మండలంలోని మూ టపల్లి గ్రామానికి చెందిన పలువురు లబ్ధిదారులకు దళిత బంధు కింద మంజూరైన యూనిట్లను గురువారం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ క్యాంపు కార్యాలయంలో అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పనిచేస్తుందని వివరించారు. దళిత బంధు పథకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ తిరుపతి, ఉప స ర్పంచ్ రంజిత్ తదితరులు ఉన్నారు. అలాగే గొల్లపెల్లి రహదారిలో ఇటీ వల రోడ్డు వెడల్పులో తాత్కాలికంగా షెడ్లు కోల్పోయిన వ్యాపారుల కో సం నూతనంగా నిర్మిస్తున్న షెడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే పరిశీలిం చారు. పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశాలు జారీచేశారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోళి శ్రీనివాస్, కౌన్సిలర్ నవీన్ ఉన్నారు. అలాగే ఇటీవల మృతి చెందిన ఫికప్ పాయింట్ అధినేత రాయంచ ప్ర భాకర్‌తో పాటు పలు కుటుంబాలను పరామర్శించి తన ప్రగాడ సానూభూతిని తెలియజేశారు.