యాసంగిలో సాగు విస్తీర్ణం పెంచాలి
ABN , First Publish Date - 2022-12-16T00:52:53+05:30 IST
రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు ఎక్కువ విస్తీర్ణాన్ని సాగులోకి తీసుకురావాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ అన్నారు.
కరీంనగర్ రూరల్, డిసెంబరు 15: రాబోయే యాసంగి సీజన్‌లో రైతులు ఎక్కువ విస్తీర్ణాన్ని సాగులోకి తీసుకురావాలని జిల్లా వ్యవసాయాధికారి శ్రీధర్ అన్నారు. గురువారం కరీంనగర్‌రూరల్ మండలంలోని దుర్శేడ్ రైతు వేదికలో డ్రమ్ సీడర్‌పై అవగాహన సదస్సుతో పాటు దుర్శేడ్ గ్రామంలో ఇప్పకింద చంద్రయ్య పొలంలో డ్రమ్ సీడర్ వాడే విధానాన్ని డెమో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపికైన 34 గ్రామాల సర్పం చులు, పంచాయతీ సెక్రెటరీలు, వ్యవసాయ విస్తరణాధికారుల సాయంతో ఎక్కువ విస్తీర్ణంలో సాగులోకి తీసుకు రావడానికి ప్రోత్సహించాలని సూచించారు.
జిల్లా పంచాయతీ అధికారి వీరబుచ్చయ్య మాట్లాడుతూ డ్రమ్ సీడర్‌కు రోజుకు 250 చొప్పున రైతు దగ్గర తీసుకున్న నగదు గ్రామ పంచాయతీ ఖాతాలో జమ చేసి సంవత్సరం తర్వాత మిగిలిన వాటిలో 20శాతం వ్యవసాయ శాఖ పనుల కోసం, 80శాతం గ్రామపంచాయతీ పనుల కోసం వినియోగించుకోవచ్చన్నారు. కరీంనగర్ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్త మంజులత మాట్లా డుతూ బురద పదనులో విత్తుకొనే డ్రమ్‌సీడర్‌లో ప్రధాన సమస్య కలుపు నివారణ అన్నారు. మొదటి 3-5 రోజులలో, 15-20 రోజుల్లో చల్లుకొనే మందుల గురించి వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాల్లో స్టీవెన్ బృందం క్షేత్ర ప్రదర్శనలో డ్రమ్ సీడర్ పనితీరు ప్రయోగాత్మకంగా వాడి చూపించారు. ఈకార్య క్రమంలో సర్పంచ్ గాజుల వెంకటమ్మ, పీఏసీఎస్ చైర్మన్ గోనె నర్సయ్య, డాట్ శాస్త్రవేత్తలు మదన్ మోహన్‌రెడ్డి, రాజేంద్రప్రసాద్, ఏడీఏలు అంజని, సునిత, శ్రీనివాస్, రామారావు, ఏవో టెక్నికల్ కృష్ణ, స్వప్న, వ్యవసాయాధికారి సత్యం, ఏఈవో ప్రణయ్ తదితరులు పాల్గొన్నారు.