రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ

ABN , First Publish Date - 2022-10-17T05:42:57+05:30 IST

వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది.

రాజన్న సన్నిధిలో భక్తుల రద్దీ
స్వామివారిని దర్శించుకుంటున్న భక్తులు

వేములవాడ, అక్టోబరు 10:  వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి దేవస్థానం ఆదివారం భక్తులతో రద్దీగా మారింది. సెలవు రోజు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు వేములవాడకు తరలివచ్చారు. ఈ సందర్భంగా వారు సర్వదర్శనం, కోడెమొక్కుల క్యూలైన్‌ ద్వారా ఆలయంలోకి చేరుకొని తమ ఇష్టదైవమైన  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతిపాత్రమైన కోడెమొక్కు చెల్లించుకున్నారు.  స్వామివారి అభిషేక పూజ, అన్నపూజ వంటి ఆర్జిత సేవల్లో పాల్గొన్నారు. బాలాత్రిపురాసుందరీదేవి ఆలయంలో కుంకుమపూజ, కళాభవన్‌లో స్వామివారి నిత్యకల్యాణం, సత్యనారాయణవ్రతం మొక్కులు చెల్లించుకున్నారు.  భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2022-10-17T05:42:57+05:30 IST