సిరిసిల్ల జిల్లాలో నేరాలు తగ్గుముఖం

ABN , First Publish Date - 2022-12-30T00:03:07+05:30 IST

ఈ యేడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న పోలీసులు పలు కేసులను సవాల్‌గా తీసుకొని క్రైం రేటును 20.6శాతం తగ్గించారు. 2022 వార్షిక నేరాలపై గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో అడిష నల్‌ ఎస్పీ చంద్రయ్యతో కలిసి ఎస్పీ రాహుల్‌ హెగ్డే వివరాలు తెలిపారు.

సిరిసిల్ల జిల్లాలో నేరాలు తగ్గుముఖం
వివరాలు వెల్లడిస్తున్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్‌ హెగ్డే

02 : వివరాలు వెల్లడిస్తున్న సిరిసిల్ల ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల జిల్లాలో నేరాలు తగ్గుముఖం

- వార్షిక నేర సమీక్షలో ఎస్పీ రాహుల్‌ హెగ్డే

సిరిసిల్ల క్రైం, డిసెంబరు 29: ఈ యేడు ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న పోలీసులు పలు కేసులను సవాల్‌గా తీసుకొని క్రైం రేటును 20.6శాతం తగ్గించారు. జిల్లాలో రెండు పోలీస్‌ సబ్‌డివిజన్‌లతో పాటు ఆరు సర్కిళ్లలో 13 పోలీస్‌స్టేషన్‌లు ఉన్నాయి. ఇవే కాకుండా రెండు ట్రాఫిక్‌ పోలీస్‌స్టేషన్‌లు, ఒక సీసీఎస్‌, రెండు షీటీమ్‌ బృందాలు, బ్లూకోట్స్‌, ఇతర నిఘా వర్గాలచే జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణపై దృష్టిసారించాయి. 2022 వార్షిక నేరాలపై గురువారం జిల్లా పోలీసు కార్యాలయంలో అడిష నల్‌ ఎస్పీ చంద్రయ్యతో కలిసి ఎస్పీ రాహుల్‌ హెగ్డే వివరాలు తెలిపారు.

20.6శాతం తగ్గిన నేరాలు

జిల్లా వ్యాప్తంగా గత ఏడాదితో పోల్చితే 20.6శాతం నేరాలు తగ్గాయి. గత ఏడాది 3,824కేసులు నమోదు కాగా 2022లో 3,036కేసులు నమోదు అయ్యాయి. ఈ ఏడాది 24కిడ్నాప్‌కేసులు అయ్యాయి. వీటన్నింటినీ చేధించారు. అత్యాచారాల సంఖ్య 38కేసులు అయినప్పటికీ గృహ హింస కింద 148 కేసులు నమోదై 18శాతం తగ్గాయి. మహిళలపై వేధింపులపై 73కేసులు నమోదై 13.1శాతం తగ్గాయి. వరకట్న కేసులు కేవలం 4మాత్రమే నమోదయ్యాయి. ఆత్మహత్యల సంఖ్య తగ్గింది. గత ఏడాది 343ఆత్మహత్యలు కాగా ఈసారి 269ఆత్మహత్యలు జరిగాయి. పోక్సో యాక్ట్‌ కింద 46కేసులు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కింద 61కేసులు నమోద య్యాయి. శారీరక నేరాల సంఖ్య గత ఏడాది 458చోటుచేసుకోగా ఈ ఏడాది 340మాత్రమే జరిగినట్లు ఎస్పీ తెలిపారు.

రౌడీయిజంపై ఉక్కుపాదం

జిల్లాలో పలు హత్యకేసులను చేధించడమే కాకుండా రౌడీయిజంపై ఉక్కుపాదం మోపినట్లు ఎస్పీ తెలిపారు. జిల్లాలో 2021లో 14 హత్యలు జరిగితే ఈ ఏడాది 14హత్యలు జరిగాయి. ఇందులో ఎక్కువగా భూవి వాదాలు, ప్రతికార హత్యలే ఉన్నాయి. మరోవైపు భూ దందాలు, దౌర్జన్యాలు, రౌడీయిజంను అణిచివేశాం. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడిన 148మందిపై రౌడీషీట్‌ కేసులు నమోదు అయ్యాయి. జిల్లాలో మహిళల రక్షణకు తోడ్పడ్డాం. ప్రధానంగా సీటీంల ద్వారా 117అవగాహన సదస్సులు ఏర్పరిచి 9,640మంది విద్యార్థులకు భరోసా కల్పించినట్లు తెలిపారు. డయల్‌ 100ద్వారా 17,027 కాల్స్‌ స్వీకరించి 320కేసులు నమో దు చేసినట్లు తెలిపారు.

ఆగని దొంగతనాలు..

జిల్లాలో ఈ యేడు దాదాపు 69 ఇండ్లలో దొంగతనాలు, 8 దోపిడీలు జరిగినట్లు ఎస్పీ తెలిపారు. వేములవాడలో భారీ చోరీ, చైన్‌ స్నాచింగ్‌, భక్తుల అభరణాల చోరీపై పోలీసులు వెంటనే దొంగలను పట్టుకున్నాం. ప్రాపర్టీ లాస్‌ కింద 10 5కేసులు నమోదుచేసి 45.89 లక్షలు రికవరీ చేశాం. జిల్లాలో గత ఏడాది కంటే మోసాలు ఎక్కువగా చోటుచేసుకు న్నాయి. ఈ ఏడాది 236 చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. మరో 10 గల్ష్‌ మోసాలు, 8 అక్రమ వడ్డీ వ్యాపారం, 63 సైబర్‌ నేరాలు జరిగాయి. జిల్లాలో 2021లో 192 రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 112 మంది మృత్యువాత పడ్డారు. ఈ ఏడాది 174 రోడ్డు ప్రమాదాల్లో 82 మంది మృతిచెందారు. గతంలో కంటే ఈ సారి 26.7శాతం ప్రమాదాలు తగ్గాయి.

అక్రమార్కుల అడ్డుకట్ట

జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌ పోలీసుల ఆధ్వర్యంలో అక్రమార్కులకు అడ్డుకట్ట వేసినట్లు ఎస్పీ రాహుల్‌ హెగ్డే పేర్కొన్నారు. ప్రధానంగా గుట్కా, గంజాయి, రేషన్‌బియ్యం అక్రమ సరఫరాపై కొరడా ఝులిపించాం. 52మంది గంజాయి విక్రయదారులను అరెస్ట్‌ చేసి 3.509కిలోల గంజా యి, 40గ్రాముల హారిష్‌ ఆయిల్‌ను సీజ్‌చేశాం. మహారాష్ట్ర నుంచి అక్రమంగా సరఫరా అవుతున్న గుట్కా రాకెట్‌ను చేధించి రూ.5.48లక్షల విలువైన గుట్కా సీజ్‌చేసి దాదాపు 21కేసులు పెట్టాం. ఇళ్లల్లో రేషన్‌ బియ్యం కొనుగోలు చేసి అధిక ధరలకు విక్రయిస్తున్న ముఠాలను అరికట్టి 84 కేసులు పెట్టి 118 మందిని అరెస్ట్‌ చేసి 26 లక్షల 52వేల510 రూపాయాల విలువైౖన రేషన్‌ బియ్యం పట్టుకున్నట్లు తెలిపారు.

ఈ-చాలన్‌ కింద రూ 3.5కోట్లు జరిమానా

జిల్లాలో ఈ-చాలన్స్‌ కింద 1,68,23కేసులు నమోదుచేసి రూ. 3.5 కోట్లు జరిమానా విధింనట్లు ఎస్పీ తెలిపారు.స్పీడ్‌ లేజర్‌ గన్‌ ద్వారా 279కేసులు నమోదుచేశాం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ కింద 9,540 కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. లోక్‌ అదాలత్‌ ద్వారా 1,161కేసులు పరిష్కరించడమే కాకుండా 121 నాన్‌ బెయిలబుల్‌ వారెంట్లను ఎగ్జిక్యూట్‌చేసినట్లు ఎస్పీ తెలిపారు. దాదాపు 21కేసులలో శిక్ష పడ్డట్లు తెలిపారు. ఇందులో ఒక నిందితుడికి జీవిత ఖైదు పడ్డట్లు శిక్షపడింది. జిల్లాలోని తంగళ్లపల్లి, వీర్నపల్లి, రుద్రంగి నూతన పోలీస్‌స్టేషన్‌లకు పక్కాభవనాలు నిర్మించ డానికి ప్రతిపాదనలు చేశాం. ఆధునిక హంగులతో నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయం త్వరలో ప్రారంభించడానికి సిద్ధం చేసినట్లు తెలిపారు. పోలీసు అధికారులు, సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని రానన్న సంవత్సరంలో మరింత సమర్ధవంతంగా సేవలందించాలని పోలీసు సిబ్బందిని ఎస్పీ రాహుల్‌ హెగ్డే కోరారు.

Updated Date - 2022-12-30T00:03:11+05:30 IST