అన్నదాతలకు అండగా సహకార సంఘాలు

ABN , First Publish Date - 2022-09-25T06:19:25+05:30 IST

సహకార సంఘాలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని సింగిల్‌ విండో కార్యాలయం వద్ద శనివారం కొండూరు రవీందర్‌రావు అధ్యక్షతన మహాజన సభను నిర్వహించారు.

అన్నదాతలకు అండగా సహకార సంఘాలు
గంభీరావుపేటలో మహాజన సభలో మాట్లాడుతున్న కొండూరు రవీందర్‌రావు

గంభీరావుపేట, సెప్టెంబరు 24:   సహకార సంఘాలు అన్నదాతలకు అండగా నిలుస్తున్నాయని నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు అన్నారు. గంభీరావుపేట మండల కేంద్రంలోని సింగిల్‌ విండో కార్యాలయం వద్ద శనివారం కొండూరు రవీందర్‌రావు అధ్యక్షతన మహాజన సభను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వానాకాలం సీజన్‌లో ఒక్క గంభీరావుపేట మండలంలో 30 వేల ఎరువుల బస్తాలు రైతులకు అందజేమన్నారు. ఎల్‌టీ రుణాల కింద రైతులకు  రూ.కోటి 40 లక్షల వరకు రుణ సౌకర్యం కల్పించామన్నారు. రూ.కోటి 75 లక్షల విలువైన ఎరువులను మార్కెట్‌ నుంచి కొనుగోలు చేశామన్నారు. గోదాముల నిర్మాణాలు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. సహకార సంఘాల ద్వారా రూ.20 కోట్ల వరకు రుణాలు ఇచ్చామన్నారు.  మూత పడిన పెట్రోల్‌ బంక్‌లను  తెరిపించడానికి ఇటీవల ఆ శాఖ మంత్రిని  కలిసినట్లు చెప్పారు. రసాయన ఎరువులను తగ్గించి సేంద్రియ ఎరువులతో అధిక దిగుబడులు పొందాలన్నారు.  గంభీరావుపేటలో నాబార్డు నిధులతో మార్కెట్‌ యార్డును నిర్మించాలని స్థానిక సర్పంచ్‌ కటకం శ్రీధర్‌పంతులు   రవీందర్‌రావు దృష్టికి తీసుకెళ్లారు. సింగిల్‌విండో వైస్‌ చైర్మన్‌ ఎర్ర రామాంజనేయులు, బ్యాంక్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌రెడ్డి, నర్మాల సర్పంచ్‌ రాజు, డైరెక్టర్లు మల్యాల రాజవీర్‌, కృష్టారెడ్డి, రాజేశ్వర్‌రావు, అంజిరెడ్డి, మురళి, నర్సయ్య, గంగారెడ్డి, సిబ్బంది పురం సత్యంరావు, నాగరాజు, మహేందర్‌, విష్ణు తదితరులు ఉన్నారు. 

Read more