పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్‌

ABN , First Publish Date - 2022-12-31T00:35:17+05:30 IST

ముంబై, అహ్మదాబాద్‌ల మాదిరిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా వంట గ్యాస్‌ సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

 పైప్‌లైన్‌ ద్వారా ఇంటింటికీ వంట గ్యాస్‌
ఆర్‌ఎఫ్‌సీఎల్‌ ప్రాంగణంలో ఐఓసీ నిర్మిస్తున్న గ్యాస్‌ స్టేషన్‌

- వాహనాలకు అందుబాటులోకి సీఎన్‌జీ

- ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు పనులు అప్పగింత

- ఆర్‌ఎఫ్‌సీఎల్‌లో పూర్తయిన గ్యాస్‌ స్టేషన్‌

- నాలుగు జిల్లాలకు సరఫరాకు ఏర్పాట్లు

కోల్‌సిటీ, డిసెంబరు 30: ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌ల మాదిరిగా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఇంటింటికీ పైప్‌లైన్‌ ద్వారా వంట గ్యాస్‌ సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌కు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పనులు అప్పగించింది. కరీంనగర్‌, సిరిసిల్లా, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో పైప్‌లైన్ల ద్వారా ఇటు వ్యాపార సంస్థలు, చిన్న తరహా పరిశ్రమలు, గృహాలకు గ్యాస్‌ సరఫరా చేయనున్నారు. పెట్రోల్‌ బంక్‌ల్లో సీఎన్‌జీ అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికి సంబంధించి రామగుండం ఫెర్టిలైజర్స్‌ అండ్‌ కెమికల్స్‌ లిమిటెడ్‌(ఆర్‌ఎఫ్‌సీఎల్‌)లో గ్యాస్‌ స్టేషన్‌ నిర్మాణం కూడా పూర్తయ్యింది. 15రోజుల్లో ఈ స్టేషన్‌ ప్రారంభం కాను న్నది. దేశ వ్యాప్తంగా పైప్‌లైన్ల ద్వారా ఇంటింటికి వంట గ్యాస్‌ సరఫరా చేయాలని కేంద్ర ప్రభుత్వం పెట్రోలియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ రెగ్యులేటరీ బోర్డు ఆధ్వర్యంలో పనులు అప్పగించింది. రాష్ట్రంలోని 33జిల్లాల్లో ఈప్రాజెక్టు చేపట్టనున్నారు. 13జిల్లాలు మెగా ఇంజనీరింగ్‌కు, ఉమ్మడి కరీంనగర్‌ ఐఓసీకి, ఉమ్మడి ఆదిలాబాద్‌ మహానగర్‌ గ్యాస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, సిద్ధిపేట, మెదక్‌, సంగారెడ్డి జిల్లాలు టోరెంటో గ్యాస్‌ సంస్థలకు అప్పగించారు. ఈ సంస్థలు కేజీ బేసిన్‌ నుంచి సరఫరా అయ్యే గ్యాస్‌ను తీసుకుని ఆయా జిల్లాల్లోని గృహ అవసరాలకు పైప్‌లైన్‌ ద్వారా సరఫరా చేస్తారు. ఇందుకు సంబంధించి మీటర్లు మిగిలి వాడిన రీడింగ్‌కు అనుగుణంగా బిల్లులు వసూలు చేస్తారు.

వ్యాపార, వాణిజ్య సంస్థలకు..

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో నివాసాలకు పైప్‌డ్‌ నేచురల్‌ గ్యాస్‌ సరఫరా చేస్తారు. వీటితో పాటు హోటళ్లు, రెస్టారెంట్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలకు డిమాండ్‌ను బట్టి సరఫరా ఉంటుంది. మొదటి దశలో రామ గుండం, పెద్దపల్లి, కరీంనగర్‌, జగిత్యాల, సిరిసిల్లా వంటి పట్టణ ప్రాంతా లకు సరఫరా చేస్తారు. వీటితో పాటు బొగ్గు ఆధారితంగా నడిచే చిన్న చిన్న పరిశ్రమలకు ప్రత్యామ్నాయంగా గ్యాస్‌ సరఫరా చేస్తారు. ముఖ్యం గా ఇండస్ర్టియల్‌ ఏరియాలోని ప్లాస్టిక్‌, ఆటో మోబైల్‌ పరిశ్రమలకు కనెక్షన్లు ఇస్తారు. కేంద్ర ప్రభుత్వం సీఎన్‌జీ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడంతో జిల్లాలోని ప్రధాన మార్గాల్లో సీఎన్‌జీ స్టేషన్లను నెలకొల్పనున్నారు. ఇప్పటికే కరీంనగర్‌లో ఐఓసీ ఆధ్వర్యంలో ఒక సీఎ న్‌జీ స్టేషన్‌ను నెలకొల్పారు. రామగుండంలో రెండు స్టేషన్లు నెలకొల్పను న్నారు.

40శాతం ధర తక్కువ..

ఎల్‌పీజీ పోల్చితే పైప్‌లైన్‌ ద్వారా సరఫరా అయ్యే గ్యాస్‌ ధరలు 40శాతం తక్కువగా ఉండనున్నది. గాలి కన్నా బరువు తక్కువగా ఉం డడంతో రక్షణ కూడా ఉంటుంది. గ్యాస్‌ లీకేజీలు, అగ్ని ప్రమాదాలకు అవకాశం ఉండదు. ఒక వేళ గ్యాస్‌ లీకైనా సాధారణంగా గాలిలో కలిసి పోతుంది. ఇళ్లల్లో మీటర్ల రీడింగ్‌ ఆధారంగా బిల్లులు వేయనున్నారు. ఇప్పటికే ఆర్‌ఎఫ్‌సీఎల్‌ టౌన్‌షిప్‌లో పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌సరఫరా చేసేందుకు నిర్ణయించారు. ఎన్‌టీపీసీ, సింగరేణి యాజ మాన్యాలతో ఐఓ సీ చర్చలు జరుపుతుంది. జిల్లాలో సింగరేణి, ఎన్‌టీపీసీలకు యాజమా న్యం నిర్వహణలోని టౌన్‌షిప్‌లు ఉన్నాయి. రామగుండంలో 16 వేల కుపైగా సింగరేణి క్వార్టర్లు ఉన్నాయి. సింగరేణి సంస్థనే కార్మిక కు టుం బాలకు గ్యాస్‌ సిలిండర్లను సరఫరా చేస్తుంది. వేతనాల్లో బిల్లులను కలిపి చెల్లిస్తుంది. సింగరేణి కార్మిక కుటుంబాలకు పైప్‌లైన్‌ ద్వారా గ్యాస్‌ సరఫ రా చేసి రీడింగ్‌ ప్రకారం యాజమాన్యమే చెల్లించే అవకాశం ఉంటుంది.

Updated Date - 2022-12-31T00:35:22+05:30 IST