వినియోగదారులుహక్కులను తెలుసుకోవాలి

ABN , First Publish Date - 2022-03-16T05:36:08+05:30 IST

వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ తెలిపారు.

వినియోగదారులుహక్కులను తెలుసుకోవాలి
సమావేశంలో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌

  అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌

కరీంనగర్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వినియోగదారులు తమ హక్కులను తెలుసుకోవాలని అదనపు కలెక్టర్‌ జీవీ శ్యాంప్రసాద్‌లాల్‌ తెలిపారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వినియోగదారుల సమాచార కేంద్రం, జిల్లా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్‌ ఆడిటోరియంలో సమావేశం నిర్వహించారను. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినియోగదారుల హక్కుల గురించి వినియోగదారులకు, విద్యార్థులకు అవగాహన సదస్సులు నిర్వహించాలని సూచించారు. కొనుగోళ్లలో, తూకంలో నష్టం జరిగినప్పుడు సంబంధిత దుకాణం యజమానిని నిలదీయాలని అన్నారు. నష్టపరిహారం పొందాలని లేదా తిరిగి కొత్త వస్తువులు తీసుకోవాలని సూచించారు. డిజిటల్‌ యుగంలో న్యాయమైన డిజిటల్‌ చెల్లింపులు జరిగేలా చూసుకోవాలని, మోసాలకు తావు లేకుండా జాగ్రత్త పడాలని తెలిపారు. ఈ సందర్భంగా వినియోగదారుల హక్కుల గురించి ముద్రించిన పోస్టర్లను అదనపు కలెక్టర్‌ ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏసీపీ విజయసారధి, వినియోగదారుల సమాచార కేంద్రం కో ఆర్డినేటర్‌ లక్ష్మణ్‌కుమార్‌, జిల్లా పౌరసరఫరాల అధికారి సురేశ్‌రెడ్డి, తూనికలు కొలతల శాఖ అధికారి రవీందర్‌, డీపీవో వీరబుచ్చయ్య, కరీంనగర్‌ వినియోగదారుల మండలి అధ్యక్షుడు కోల రాంచంద్రారెడ్డి, ప్రకాశ్‌హొల్లా, సయ్యద్‌ ముజఫర్‌, ఆర్‌ వెంకటేశ్వర్‌రావు, అరుణ్‌, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు. 

Read more