ఆర్థిక గణాంకాలను గడువులోగా పూర్తిచేయండి

ABN , First Publish Date - 2022-12-16T23:59:06+05:30 IST

ఆర్థిక గణాంకాలను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని ఫైనాన్స్‌ అధికారులకు డైరెక్టర్‌(ఫైనాన్స్‌, పీపీ) బలరాంనాయక్‌ సూచించారు.

ఆర్థిక గణాంకాలను గడువులోగా పూర్తిచేయండి

గోదావరిఖని, డిసెంబరు 16: ఆర్థిక గణాంకాలను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని ఫైనాన్స్‌ అధికారులకు డైరెక్టర్‌(ఫైనాన్స్‌, పీపీ) బలరాంనాయక్‌ సూచించారు. శుక్రవారం స్థానిక ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో రామగుండం, బెల్లంపల్లి రీజియన్లకు చెందిన ఫైనాన్స్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఫైనాన్స్‌ అకౌంట్స్‌ను త్వరితగతిన పూర్తిచేయాల న్నారు. ఈ ఆర్థిక సంవత్సరం గణాంకాలను పూర్తి చేయాలని, ఇబ్బం దులు ఉంటే అడిగి తెలుసుకోవాలని, ఫైనాన్స్‌కు సంబంధించిన పలు విషయాలపై అధికారులకు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఆర్‌జీ-1 జీఎం కల్వల నారాయణ, కార్పొరేటర్‌ జీఎం(ఫైనాన్స్‌) సుబ్బా రావు, ఆర్‌జీ-1 ఏజీఎం రామకృష్ణ, ఆర్‌జీ-3 ఏజీఎం శ్రీనివాసులు, మం దమర్రి ఏజీఎం చక్రవర్తి, శ్రీరాంపూర్‌ ఏజీఎం మురళీధర్‌, భూపాల పల్లి, శ్రీరాంపూర్‌, మందమర్రి, గోలేటి, ఎస్‌టీపీపీ, ఆర్‌జీ-1, 2, 3 ఏరి యాల అకౌంట్స్‌, ఫైనాన్స్‌ ఆఫీసర్స్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-16T23:59:10+05:30 IST