అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

ABN , First Publish Date - 2022-12-31T00:23:54+05:30 IST

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్యేయమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసారగ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతలు అన్నారు. శుక్రవారం మల్లాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా ఏర్పాటు చేసిన మినీ స్టేడియంను బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు.

అన్ని వర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం
మల్లాపూర్‌లో శిలఫలకం ఆవిష్కరిస్తున్న ఎమ్మెల్యే, జడ్పీచైర్‌పర్సన్‌

మల్లాపూర్‌, డిసెంబరు 30 : అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ద్యేయమని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసారగ్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంతలు అన్నారు. శుక్రవారం మల్లాపూర్‌ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో నూతనంగా అదనపు తరగతి గదుల నిర్మాణానికి శంకుస్థాపన, నూతనంగా ఏర్పాటు చేసిన మినీ స్టేడియంను బీఆర్‌ఎస్‌ రాష్ట్ర యువ నాయకుడు డాక్టర్‌ కల్వకుంట్ల సంజయ్‌, స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. క్రీడాకారులతో మాట్లాడి క్రికెట్‌ టోర్నమెంట్‌ను ప్రారంభించి ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ క్రీడాకారులను ప్రోత్సహించడానికి రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో క్రీడా ప్రాంగణాలతో పాటు మినీ స్టేడియంలను ఏర్పాటు చేస్తుందని అన్నారు. దీన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూడలేక ఇటీవల షర్మిల, బండి సంజయ్‌లు పాదయాత్రలు చేసుకుంటూ ప్రభుత్వాన్ని తిట్టడానికి తిరిగినట్లు ఉన్నదని ఎద్దేవా చేశారు. జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత మాట్లాడుతూ బాండ్‌ పేపర్‌ రాసిన ఎంపీ అర్వింద్‌ ఎలాంటి హామీలను నెరవేర్చారని ప్రశ్నించారు. అనంతరం గుండంపల్లి గ్రామంలో మన ఊరు మన బడి పనులకు శంకుస్థాపన, రేగుంటలో యువజన సంఘాల భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఆయా కార్యక్రమంలో ఎంపీపీ కాటిపల్లి సరోజన-ఆదిరెడ్డి, జడ్పీటీసీ సందిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీడీవో రాజా శ్రీనివాస్‌, తహసీల్దార్‌ రవీందర్‌, ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Updated Date - 2022-12-31T00:25:18+05:30 IST

Read more