పేదల ఆరోగ్యానికి సీఎం పెద్దపీట
ABN , First Publish Date - 2022-12-16T23:51:55+05:30 IST
పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు.
గోదావరిఖని, డిసెంబరు 16: పేదల ఆరోగ్యానికి ముఖ్యమంత్రి కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం రామ గుండం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజవర్గానికి చెందిన 63మంది లబ్ధి దారులకు రూ.50.65లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ పేద వారి ఆరోగ్యం కోసం సీఎం సహాయ నిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనారోగ్యానికి గురైన పేదలకు కార్పొరేట్ వైద్యం అందిస్తూ వారికి ముఖ్యమంత్రి అండగా నిలబడుతున్నారన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటి వరకు రూ.10కోట్ల వరకు సీఎం సహాయ నిధిని పంపిణీ చేశామన్నారు. అంతేకాకుండా రామగుండం ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందించడా నికి సింగరేణి నిధులతో మెడికల్ కళాశాల నిర్మాణం కూడా చేపట్టారన్నారు. తెలం గాణ రాష్ట్రం వచ్చిన తరువాత అన్నదాతల సంక్షేమానికి ముఖ్యమంత్రి ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో మేయర్ బంగి అనీల్‌కుమార్, డిప్యూటీ మేయర్ అభిషేక్‌రావు, జడ్‌పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు కన్నూరి సతీష్ కుమార్, కొమ్ము వేణుగోపాల్, కల్వచర్ల కృష్ణవేణి, దాతు శ్రీనివాస్, ఐత శివకుమార్, బాల రాజ్‌కుమార్, కవితసరోజిని, శంకర్‌నాయక్, రమణారెడ్డి పాల్గొన్నారు.