ముగిసిన సెస్‌ నామినేషన్లు

ABN , First Publish Date - 2022-12-16T01:18:27+05:30 IST

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ఎన్నిక ల్లో నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. శుక్ర వారం ఉదయం 10గంటల నుంచి నామినేషన్లను పరి శీలించనున్నారు. అర్హులైన తుది జాబితాను వెల్లడించ నున్నారు.

 ముగిసిన సెస్‌ నామినేషన్లు
సిరిసిల్ల సెస్‌ వద్ద నామినేషన్ల సందడి

- నేడు పరిశీలన

- చివరి రోజు 93 మంది దాఖలు

- 15 డివిజన్లలో 155 మంది అభ్యర్థులు

- ముందుకొచ్చిన మహిళా అభ్యర్థులు

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం ఎన్నిక ల్లో నామినేషన్ల పర్వం గురువారం ముగిసింది. శుక్ర వారం ఉదయం 10గంటల నుంచి నామినేషన్లను పరి శీలించనున్నారు. అర్హులైన తుది జాబితాను వెల్లడించ నున్నారు. పరిశీలనలో నామినేషన్‌ నిలుస్తుందా? తిరస్క రణకు గురవు తుందా? అని అభ్యర్థులు టెన్షన్‌కు గురవ ుతున్నారు. చివరి రోజు జిల్లాలోని 15 ప్రాదేశిక నియోజ కవర్గాల నుంచి 93మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖ లు చేశారు. సిరిసిల్ల టౌన్‌-1, వేములవాడ టౌన్‌-1 స్థానా లు మహిళలకు రిజర్వ్‌ కావడంతో అభ్యర్థుల ఎంపిక పార్టీలకు ఇబ్బందిగా మారింది. సిరిసిల్ల టౌన్‌ -1 స్థానానికి రెండు రోజులు నామినేషన్లు దాఖలు కాలేదు. చివరిరోజు మహిళలు పెద్ద సంఖ్యలో ముందు కొచ్చారు. సిరిసిల్ల టౌన్‌-1, వేములవాడ టౌన్‌-1 మహిళా రిజర్వే షన్‌ స్థానాలతోపాటు జనరల్‌ స్థానాల్లో కూడా మహి ళలు నామినేషన్లు వేశారు. నామినేషన్లు ముగిసిన తరు వాత 15 స్థానాల్లో 155 నామినేషన్లు దాఖలు అయ్యాయి.

జిల్లా కేంద్రంలో నామినేషన్ల సందడి

జిల్లాలోని అన్ని డివిజన్లకు సంబంధించిన నామినేష న్లు సిరిసిల్ల సెస్‌ ప్రధాన కార్యాలయంలోనే స్వీకరిం చడం, చివరి రోజు కావడంతో గురువారం ఆయా పార్టీల మద్దతు దారులు, అభ్యర్థులతో సందడి నెలకొంది. బీఆర్‌ ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ బలపరుస్తున్న అభ్యర్థులు భారీ ర్యాలీగా సిరిసిల్ల సెస్‌ ప్రధాన కార్యాలయానికి తరలివ చ్చారు. సిరిసిల్లలోని ఫంక్షన్‌హాల్‌లలో బీఆర్‌ఎస్‌ మద్దతు అభ్యర్థులకు సంఘీభావంగా గులాబీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించాయి. కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు బైక్‌ ర్యాలీ చేపట్టారు. నామినేషన్ల కేంద్రం వద్దకు ర్యాలీగా వచ్చిన గులాబీ శ్రేణులతో ఎమ్మెల్యేలు రసమయి బాల కిషన్‌, సుంకె రవిశంకర్‌, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, టెక్స్‌టైల్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ గూడూరి ప్రవీణ్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, అర్బన్‌ బ్యాంక్‌ చైర్మన్‌ గాజుల నారా యణ, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, మాజీ మున్సిపల్‌ చైర్‌పర్సన్లు గుడ్ల మంజుల, సామల పావని, మున్సిపల్‌ కౌన్సిలర్లు, బీఆర్‌ఎస్‌ ముఖ్యనాయకులు తరలి వచ్చారు. బీజేపీ సీనియర్‌ నాయకులు మట్ట వెంకటేశ్వర్‌ రెడ్డి, గాజుల వేణు, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు ఆకునూరి బాల రాజు నామినేషన్లు వేయించారు. మండలాల నుంచి కాం గ్రెస్‌ నాయకులు బైక్‌ ర్యాలీతో తరలివచ్చారు.

భారీగా రెబల్స్‌..

బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ మద్దతు తెలుపుతూ అభ్య ర్థులను ప్రకటించినా రెబల్స్‌ పార్టీల నిర్ణయానికి అతీ తంగా నామినేషన్లు దాఖలు చేశారు. బరిలో ఉంటారా? నామినేషన్లు ఉపసంహరిం చుకుంటారా? అనే అంశంపై చర్చ సాగుతోంది. పార్టీలకు అతీతంగానే సెస్‌ ఎన్నికలు కొనసాగనున్నాయి. పార్టీ గుర్తులు, భీఫాంలు లేకపోవ డంతో ఎవరికి వారే పార్టీ అభ్యర్థులుగా ప్రచారానికి సిద్ధ మవుతున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ముఖ్య నాయ కులు వారిని బుజ్జగించే పనిలో పడ్డారు. ఉపసంహర ణలు 17వ తేదీన ఉండడంతో ఏకగ్రీవాల వైపు కూడా ఆలోచన చేస్తు న్నారు. బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ అభ్యర్థులను కాపాడుకునేందుకు దృష్టిసారించాయి.

చివరి రోజు అభ్యర్థులు

సిరిసిల్ల సెస్‌ పరిధిలో చివరి రోజు 15 స్థానాల్లో 93 నామినేషన్లు దాఖలు అయ్యాయి. సిరిసిల్ల టౌన్‌-1 స్థానంలో బండారి సంధ్య, పాతూరి అఖిల, వంగ సంగీత, దిడ్డి రమాదేవి, జలగం అర్చన, ఉలిసె రోజా, అవదూత మణెమ్మ, మోర శైలజ, మామిడాల లత, చల్ల లావణ్య, బి.కాశమ్మ, సూరం పద్మ, సిరిసిల్ల టౌన్‌-2 స్థానంలో గుంటుక మహేష్‌, దార్నం లక్ష్మీనారా యణ, కూరపాటి శ్రీధర్‌, వెంగళ అశోక్‌, బూర యాద గిరి, బూర నాగరాజు, కూతూరి వెంకట్‌రెడ్డి, ఇల్లంత కుంట స్థానంలో మహ్మద్‌ జమాల్‌, పోతరాజు పర్శరా ములు, ఏనుగుల లింగయ్య, మల్లుగారి రవీందర్‌రెడ్డి, బి.రాఘవరెడ్డి, సింగరి శ్రీనివాస్‌, ఎల్లారెడ్డిపేట స్థానంలో గుండాడి వెంకట్‌రెడ్డి, వర్స కృష్ణహరి, బంగారం లక్ష్మారెడ్డి, గంట అంజయ్య, పొన్నాల తిరుపతి, సద్ది లక్ష్మారెడ్డి, వేములవాడ టౌన్‌- 1 స్థానంలో అల్లాడి నళిని, నామాల ఉమ, కోయినేని పద్మ, బొజ్జ భారతి, వేములవాడ టౌన్‌-2 స్థానంలో చొక్కాల రాము, నీలం గురవయ్య, రేగులపాటి హరి చరణ్‌రావు, పిల్లి కనకయ్య ముస్తాబాద్‌ స్థానంలో జక్కుల యాదగిరి, మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, మేర్గు హన్మాంతుగౌడ్‌, ఎల్లబాల్‌రెడ్డి, జాగీల్ల శ్రీనివాసరావు, గంభీరావు పేటలో జి.నారా యణరావు, దమ్ము శ్రీనివాస్‌, మల్యాల రాజవీరయ్య, అంబటి ఎల్లయ్య, తంగళ్లపల్లి స్థానంలో శాగ యాదగిరి, దుబ్బాక మల్లయ్య, వెన్నమనేని శ్రీధర్‌రావు, మోర నిర్మల, రాగుల రాజిరెడ్డి, జాల్గం ప్రవీణ్‌ కుమార్‌, చిక్కాల రామారావు, సుద్దాల శ్రీనివాస్‌, దడిగెల శ్రావణ్‌రావు, తాళ్లపల్లి శ్రీనివాస్‌గౌడ్‌, వీర్నపల్లి స్థానంలో గుగులోతు హరిలాల్‌, మాలోతు ప్రకాష్‌, లొకృతి మాలోతు, భూక్య సంతోష్‌, లెంకల లక్ష్మణ్‌,

బోయినపల్లి స్థానంలో కొట్టెపల్లి సుధాకర్‌, కట్కూరి అంజనేయులు, కట్ట లచ్చయ్య, బొలుమాల శంకరయ్య, కత్తెరపాక కొండయ్య, చందుర్తి స్థానంలో లింగంపల్లి బాబు, పి.శ్రీనివాసరావు, అనుగుల అనిల్‌కుమార్‌, ఏనుగుల లక్ష్మీ, ఏనుగుల కనుకయ్య, చిలుక అంజయ్య, అంచ శ్రీహరిరెడ్డి, కుమ్మరి చిరంజీవి రుద్రంగి స్థాన ంలో... పడాల గణేష్‌, ఆకుల గంగారాం, అక్కనపల్లి నర్సింగరావు, ఎర్రం నర్సయ్య, నంద్యాడపు సుమలత, కోనరావుపేట స్థానంలో గున్నాల లక్ష్మణ్‌, జింక శ్రీనివాస్‌, మందాల శ్రీనివాస్‌, వేములవాడ రూరల్‌లో వకుళా భరణం శ్రీనివాస్‌ నామినేషన్లు వేశారు.

Updated Date - 2022-12-16T01:18:36+05:30 IST