పాఠశాలల్లో పడకేసిన పరిశుభ్రత

ABN , First Publish Date - 2022-10-22T05:08:20+05:30 IST

ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత పడకేసింది. స్కావెంజర్లు లేకపోవడంతో చెత్తా చెదారంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పాఠశాలల్లో పడకేసిన పరిశుభ్రత
కరీంనగర్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో అపరిశుభ్రంగా ఉన్న టాయిలెట్లు

  స్కావెంజర్లు లేక ఇబ్బందులు

  పట్టించుకోని ‘పంచాయతీ’లు 

  ఉపాధ్యాయులపైనే భారం 


కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 21: ప్రభుత్వ పాఠశాలల్లో పరిశుభ్రత పడకేసింది. స్కావెంజర్లు లేకపోవడంతో చెత్తా చెదారంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరిశుభ్రత బాధ్యతను ప్రభుత్వం పంచా యతీలకు అప్పగించడంతో వారు పూర్తి స్థాయిలో పట్టించుకోవడం లేదు. కరోనా సమయంలో ప్రభుత్వ పాఠశాలలను మూసివేసిన రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో స్కావెంజర్లకు ఇచ్చే నిధులను నిలిపివేసింది. 2021-22 విద్యాసంవత్సరం ప్రారంభంలో కొవిడ్‌ తీవ్రత తగ్గక పోవడంతో కొద్దిరోజులు ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిం చి, సెప్టెంబరు మాసం నుంచి పాఠశాలలను పునః ప్రారంభించింది. అయితే స్కావెంజర్ల కోసం పాఠశాలలకు విద్యార్థుల సంఖ్యను బట్టి ఏడాదికొకసారి ఇచ్చే 20 నుంచి 25వేల రూపాయల నిధులను విడుదల చేయలేదు. ప్రభుత్వ పాఠశాలల పరిశుభత్ర బాధ్యతను సంబంధిత గ్రామపంచాయతీలు, మున్సి పాలిటీలకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దీనితో కొవిడ్‌తో మూతపడ్డ పాఠశాలలను శుభ్రం చేయించి ఆ తర్వాత క్రమేపీ సిబ్బందిని పాఠశాలలకు పంపించడాన్ని గ్రామపంచాయతీలు నిలిపివేశాయి. 


విద్యార్థులపై తీవ్ర ప్రభావం


పాఠశాల పరిసరాలు, మరుగుదొడ్లు అపరిశుభ్రంగా ఉండటంతో విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఉపాధ్యా యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 651 ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠ శాలలుండగా దాదాపుగా ఎక్కడో ఒకటి రెండు పంచాయతీలు మినహా మిగిలిన పాఠశాలల్లో పరిశుభ్రత పై దృష్టి సారించడం లేదు.  కొన్ని చోట్ల ప్రధానోపాధ్యాయులు, మరికొన్ని చోట్ల ఉపాధ్యాయులంతా కలిసి స్కావెంజర్లకు సొంత డబ్బులను ఇచ్చి పాఠ శాలల్లోని మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తు న్నారు. స్కావెంజర్లను నియమించేం దుకు నిధులు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘా లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. సంఘాలక తీతంగా అన్ని ఉపాధ్యాయ సంఘాలు పలు మార్లు స్కావెంజర్లను నియమించాలని కోరుతూ ప్రభుత్వానికి వినతి పత్రాలు కూడా ఇచ్చాయి. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం స్కావెంజర్లపై ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనితో పాఠశాల ప్రధానో పాధ్యాయులు కొన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీలపై ఒత్తిడి తెచ్చి వారంలో కొద్దిరోజుల పాటు శుభ్రం చేయించడంతో పాటు మరుగుదొడ్లను శుభ్రం చేయిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం కరీంనగర్‌ వంటి స్మార్ట్‌సిటీ నగరాల్లో స్వచ్ఛ పాఠశాలలను ప్రారంభిస్తోంది. అయితే స్వచ్ఛతపై అవగాహన కల్పిస్తున్న ప్రభుత్వం పాఠశాలల్లో స్కావెం జర్లను ఎందుకు నియమిం చడం లేదని ఉపాధ్యాయులు, పిల్లల తల్లిదండ్రులు, విద్యాకమిటీ సభ్యులు ప్రశ్నిస్తు న్నారు. ఇటు ప్రభుత్వం పట్టించుకోక, అటు పంచాయతీ లు పట్టించుకోక ప్రభుత్వ పాఠశాలల్లో అపరిశుభ్రత పెరిగిపోతోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పాఠశా లలకు స్కావెంజర్లను నియమించాలని ఉపాధ్యాయ సంఘాలు కోరతున్నాయి. 

Updated Date - 2022-10-22T05:08:20+05:30 IST