టీఆర్‌ఎస్‌ నాయకుల సంబరాలు

ABN , First Publish Date - 2022-10-07T05:47:07+05:30 IST

సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అనే జాతీయ పార్టీని ప్రకటించడాన్ని హర్షిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని తహసీల్‌ చౌరస్తాలో యువజన విభాగం నాయకులు సంబరాలు నిర్వహించారు.

టీఆర్‌ఎస్‌ నాయకుల సంబరాలు
కోరుట్లలో టపాసులు కాలస్తున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

జగిత్యాల టౌన్‌, అక్టోబరు 6 :  సీఎం కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ అనే జాతీయ పార్టీని ప్రకటించడాన్ని హర్షిస్తూ బుధవారం జిల్లా కేంద్రంలోని తహసీల్‌ చౌరస్తాలో యువజన విభాగం నాయకులు సంబరాలు నిర్వహించారు.  టపాసులు పేల్చి, స్వీట్లు పంపిణీ చేశారు. దేశ అభివృద్ధి బీఆర్‌ఎస్‌ తోనే సాధ్యమని పట్టణ యువజన విభాగం అధ్యక్షుడు కత్తురోజు గిరి మాట్లా డారు. నాయకులు ఆనంద్‌ రావు, ముజాహిద్‌, సత్యం, ఆరీఫ్‌, ప్రతాప్‌, నర్సయ్య, గౌస్‌, రవి, మహేష్‌, క్రాంతి ఉన్నారు.

కోరుట్ల: టీఆర్‌ఎస్‌ పార్టీని జాతీయ పార్టీ బీఆర్‌ఎస్‌గా రాష్ట్ర ముఖ్యమం త్రి ప్రకటించడాన్ని స్వాగతిస్తూ గురువారం పట్టణంతో పాటు మండలం లోని నాయకులు, ప్రజాప్రతినిదులు సంబరాలు నిర్వహించారు.   

Read more