ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష

ABN , First Publish Date - 2022-10-17T05:36:57+05:30 IST

గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ తెలిపారు.

ప్రశాంతంగా గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష
పెద్దపల్లిలో పరీక్ష కేంద్రాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌

- జిల్లాలో 77.19 శాతం హాజరు..

- పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసిన కలెక్టర్‌, సీపీ 

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు 16 : గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష జిల్లాలో ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.సంగీత సత్యనారాయణ తెలిపారు.ఆదివారం గ్రూప్‌-1 ప్రిలిమినరీ పరీక్ష సందర్భంగా కలెక్టర్‌ పెద్ద పల్లిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ట్రినిటి ఫార్మా కళాశాల, గాయత్రి డిగ్రీ కళాశాలలను సందర్శించి పరీక్ష నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పరీక్షాకేంద్రాల్లో అధికారులు తీసుకున్న బయోమెట్రిక్‌ హాజరు నమోదును, పరీక్ష నిర్వహణ తీరు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించారు. జిల్లాలో 16పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా జరిగినట్లు తెలిపారు. మొత్తం 16పరీక్ష కేంద్రాల్లో 6067 మంది పరీక్ష రాయాల్సి ఉం డగా, 1384 మంది గైర్హాజరుకాగా, 4683 మంది హజరయ్యారని, 77.19 శాతం హాజరు నమోదైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్‌ బిట్ల సుధాకర్‌, చీఫ్‌సూపరింటెండెంట్‌లు, లైజన్‌ అధికారులు, పోలీస్‌ అధి కారులు, తదితరులు పాల్గొన్నారు. జిల్లా సమీకృత కలెక్టరేట్‌ కార్యాలయం లో ఏర్పాటు చేసిన గ్రూప్‌-1 కలెక్టింగ్‌ పాయింట్‌లో పరీక్ష అనంతరం 16 పరీక్షా కేంద్రాల నుంచి అభ్యర్థులు రాసిన పత్రాలను, ఉపయోగించిన పత్రాలను, సంబంధిత మెటీరియల్‌ను సంబందిత లైజన్‌ అధికారులు, సెంటర్‌ ఛీప్‌ సూపరింటెండెంట్‌లు తీసుకొని వచ్చి టీఎస్‌పీఎస్‌సీ నుంచి వచ్చిన అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారులు రోహిత్‌కుమార్‌, అజయ్‌లకు అదన పు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ సమక్షంలో అందజేశారు. ఈ కలెక్టింగ్‌ పాయిం ట్‌ వద్ద డీఈవో మాధవి, కలెక్టరేట్‌ సి సెక్షన్‌ సూపరింటెండెంట్‌ తూము రవిందర్‌, సెక్షన్‌ సహాయకులు అలీ పాల్గొన్నారు. 

Updated Date - 2022-10-17T05:36:57+05:30 IST