కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను పూర్తి చేయాలి
ABN , First Publish Date - 2022-12-16T00:57:25+05:30 IST
కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కాంట్రాక్టర్లను, ఇంజనీ రింగ్ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, డిసెంబరు 15: కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ ఆర్వీ కర్ణన్ కాంట్రాక్టర్లను, ఇంజనీ రింగ్ అధికారులను ఆదేశించారు. గురు వారం ఆర్‌అండ్‌బి అధికారులు, కాంట్రా క్టర్లతో కలిసి కేబుల్ బ్రిడ్జి అప్రోచ్ రోడ్డు పనులను కలెక్టర్ పరిశీలించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తీగల వంతెన అప్రోచ్ రోడ్డు నిర్మాణ పనులను రేయింబవళ్లు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని ఆదే శించారు. ఈ కార్యక్రమంలో ఆర్‌అండ్‌బి డీఈ రవీందర్, ఏఈ రాజశేఖర్, అశోక్, కాంట్రాక్టర్ కమాలుద్దీన్, తదితరులు పాల్గొన్నారు.