రక్తదానం మహాదానం

ABN , First Publish Date - 2022-08-18T06:06:19+05:30 IST

రక్తదానం మహాదానం అని కలెక్టర్‌ రవి అన్నారు.

రక్తదానం మహాదానం
జగిత్యాలలో నిర్వహించిన రక్తదాన శిబిరంలో పాల్గొన్న కలెక్టర్‌, ఎమ్మెల్యే, జడ్పీ చైర్‌పర్సన్‌

 కలెక్టర్‌ రవి

జగిత్యాల టౌన్‌, ఆగస్టు 17: రక్తదానం మహాదానం అని కలెక్టర్‌ రవి అన్నారు. స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలలో తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ జిల్లా శాఖ ఆధ్వర్యం లో ఏర్పాటు చేసిన మెగా రక్తదాన శిబిరాన్ని  కలెక్టర్‌ రవి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌ ప్రారంభించారు. జిల్ల్లా కేంద్రంలోని మున్సిపల్‌, రెవెన్యూ, పోలీస్‌ శాఖలతో పాటు వివిధ శాఖల్లో పనిచేస్తున్న అధికారులు, యువకులు, రక్తదాతలు, ప్రజాప్రతినిధులు, రోటరీ క్లబ్‌ సభ్యులు, జర్నలిస్టులు రక్తదానం చేసి తమ దేశభక్తిని చాటుకున్నారు. రక్తదానం చేసిన పలువురిని కలెక్టర్‌ రవి, ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జడ్పీ జడ్పీచైర్‌పర్సన్‌ దావ వసంత అభినందించి, ప్రశంసాపత్రాలను అందజేశారు. జగిత్యాల పట్టణంలోని పలు ప్రాంతాల్లో స్వాతంత్య్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహించిన రక్తదాన శిబిరాల్లో యువత రక్తదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి శ్రీధర్‌, ఆర్డీవో దుర్గామాధురి, రోటరీ క్లబ్‌ ప్రతినిధులు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్‌, బొడ్ల జగదీష్‌, వైస్‌ చైర్మన్‌ గోలి శ్రీనివాస్‌, తెలంగాణ నాన్‌ గెజిటెడ్‌ ఆఫీసర్స్‌ యూనియన్‌ జిల్లా శాఖ నాయకులు బోగ శశిధర్‌, వకీల్‌, నాయకులు గట్టు సతీష్‌, దావ సురేష్‌, బోగ ప్రవీణ్‌, పంబాల రాము, నవీన్‌, అనిల్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-18T06:06:19+05:30 IST