కరీంనగర్‌ వేదికగా బీజేపీ బలప్రదర్శన

ABN , First Publish Date - 2022-12-10T00:52:39+05:30 IST

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర కరీం నగర్‌ జిల్లాలో ముగియనున్న నేపథ్యంలో ఆ పార్టీ ఈ నెల 15న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభకు హాజరు కానుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

కరీంనగర్‌ వేదికగా బీజేపీ బలప్రదర్శన

- 15న బీజేపీ భారీ బహిరంగ సభ

- కరీంనగర్‌కు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా రాక

- గులాబీ కోటలో పాగా వేసే ప్రయత్నం

- వేడెక్కుతున్న కరీంనగర్‌ రాజకీయం

(ఆంధ్రజ్యోతిప్రతినిధి, కరీంనగర్‌)

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ చేపట్టిన ఐదవ విడత ప్రజాసంగ్రామ యాత్ర కరీం నగర్‌ జిల్లాలో ముగియనున్న నేపథ్యంలో ఆ పార్టీ ఈ నెల 15న భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బహిరంగ సభకు హాజరు కానుండటం ప్రాధాన్యతను సంతరించుకున్నది.

వాస్తవానికి మరో రెండు రోజుల అనంతరం యాత్ర ముగింపు జరుగాల్సి ఉండగా జేపీ నడ్డాకు ఇతర కార్యక్రమాలుండడంతో షెడ్యూల్‌ను ముందుకు జరిపారు. టీఆర్‌ఎస్‌ తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టిన సింహగర్జన సభకు వేదికైన జిల్లా కేంద్రం లోని ఎస్‌ఆర్‌ఆర్‌ కాలేజీ గ్రౌండ్‌లోనే ప్రజాసంగ్రామ యాత్ర ముగింపు సభను నిర్వహించాలని బీజేపీ నిర్ణయించింది. ఉద్యమకాలంలో, రాష్ట్రం సిద్ధించిన తర్వాత భారీ ఎత్తున బహిరంగ సభలు నిర్వహించి సంచలన రికార్డులను నమోదు చేయడంలో టీఆర్‌ఎస్‌కు పెట్టింది పేరు. ఇప్పుడు టీఆర్‌ఎస్‌ సభలను మించి జనసమీకరణ చేసి తెలంగాణ గడ్డ... బీజేపీ అడ్డా... అని నిరూపించాలని బీజేపీ తల పోస్తున్నది. రాష్ట్రంలో ముందస్తు ఎన్నికలు జరుగ బోతున్నాయని రకరకాల సంకేతాలు వస్తున్న నేపథ్యంలో జరుగబోతున్న బీజేపీ సభ జిల్లాలో రాజకీయ వేడిని రగిలిస్తున్నది.

భారీ సంఖ్యలో జనసమీకరణ చేసేందుకు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్‌ జిల్లా నాయకులకు దిశానిర్దేశం చేస్తూ పాదయాత్రలోనే సమావేశాలు నిర్వహిస్తున్నారు. మీడియాను, సోషల్‌ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించడమే కాకుండా పార్టీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి సభకు హాజరు కావాలని ప్రజలను విజ్ఞప్తి చేయాలని సూచిస్తు న్నారు. ఐదు రోజుల పాటు పార్టీ నాయకులు, కార్య కర్తలందరూ గ్రామాల్లోకి వెళ్లి ప్రజాసంగ్రామయాత్ర ముగింపు సభను విజయవంతం చేసేందుకు ప్రజల ను సమీక రించాలని సూచిస్తున్నారు. కరీంనగర్‌, ఆదిలాబాద్‌, నిజమాబాద్‌ పార్లమెంట్‌ నియోజక వర్గాల్లో బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తుండడం, పెద్దపల్లి పార్లమెంట్‌ పరిధిలో కూడా పార్టీకి గట్టిపట్టు ఉండడంతో ఉత్తర తెలంగాణ జిల్లాల నుంచి భారీ జనసమీకరణ జరిపి వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం రాబోతుందనే సంకే తాలు ఇవ్వాలని జాతీయ అధ్యక్షుడు నడ్డాతో అదే మాట చెప్పించాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావి స్తున్నట్లు సమాచారం. కేసీఆర్‌కు టీఆర్‌ఎస్‌కు ఎల్ల వేళలా వెన్నుదన్నుగా ఉంటూ ఉద్యమ సమయాల్లో క్రియాశీలంగా నిలిచిన కరీంనగర్‌లో గులాబీదండును ఖంగు తినిపించడం ద్వారా రాజకీయంగా పైచేయి సాధించాలని బీజేపీ నాయ కత్వం భావిస్తున్నది.

ఈ పరిణామాలన్నిటినీ టీఆర్‌ఎస్‌ అధినాయక త్వం కూడా సీరియస్‌గా గమనిస్తూ బీజేపీకి చెక్‌ పె ట్టాలని వ్యూహం రూపొందించుకుంటున్నట్లు సమా చారం. నడ్డా పాల్గొనే బహిరంగ సభకు హాజరయ్యే జనానికి రెట్టింపు జనంతో సవాల్‌ సభ నిర్వహిం చాలని పార్టీ నాయకత్వం భావిస్తున్నట్లు సమాచా రం. జనవరిలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లా పర్యటన ఏర్పాటు చేసి వివిధ అభివృద్ధి కార్యక్రమా లకు ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు నిర్వహిం చాలని, అదే సందర్భంగా భారీ బహిరంగ సభ ఏర్పా టు చేయాలని టీఆర్‌ఎస్‌ నాయకులు భావిస్తున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌ బీఆర్‌ఎస్‌గా మారిన తర్వాత కరీంనగర్‌లో ఏర్పాటు చేసే మొదటి సమావేశాన్నే మళ్లీ సింహగర్జన సమావేశంలా విజయవంతం చే యాలని భావిస్తున్నట్లు సమాచారం.

బీజేపీ ఎంపీలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజక వర్గాల పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో అలాగే ఆ పార్టీ ప్రత్యేక దృష్టి సారించిన ఎస్సీ అసెంబ్లీ నియో జకవర్గాలలో టీఆర్‌ఎస్‌ పకడ్బందీ వ్యూహరచనతో సాగాలని టీఆర్‌ఎస్‌ అధినాయకత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఒక్క స్థానాన్ని కూడా బీజేపీకి దక్కకుం డా చూడాలనే లక్ష్యంతో ముందుకు సాగాలని స్థానిక నేతలకు దిశానిర్దేశం చేసిన కేసీఆర్‌ మరోసారి కరీం నగర్‌వేదికగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారని సమాచారం.

Updated Date - 2022-12-10T00:52:49+05:30 IST