మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్

ABN , First Publish Date - 2022-03-18T18:05:08+05:30 IST

: తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు.

మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యలపై బండి సంజయ్ కౌంటర్

కరీంనగర్: తనపై మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ...  డబ్బాలో రాళ్లేసి ఊపినట్లు మాట్లాడుతున్నారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని ఉద్దేశించి మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు చేయగా.... డబ్బాలో కాదు.. డ్రమ్ములో రాళ్లేసే వాడి గురించి మాట్లాడను అంటూ బండి సంజయ్ కామెంట్స్ చేశారు. వాడు, వీడు ఏదో మాట్లాడితే పట్టించుకోనన్నారు. అవినీతి అక్రమాలతో ఏమీ సాధించలేమని తెలిపారు. అహంకారంతో పాలిస్తే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెప్తారని హెచ్చరించారు. హిందూ ధర్మాన్ని హేళన చేయడం ఫ్యాషన్ గా మారిందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 

Read more