భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2022-09-12T04:59:36+05:30 IST

రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలను అంచనా వేస్తూ లోత ట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలను తరలించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ ఆదేశించారు.

భారీ వర్షాలపై అప్రమత్తంగా ఉండాలి
ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి దిగువకు వెళుతున్న నీరు

- లోతట్టు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలి

- కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ

పెద్దపల్లి, సెప్టెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని, వర్షాలను అంచనా వేస్తూ లోత ట్టు ప్రాంతాల్లో నివసిస్తున్న వారిని సురక్షిత ప్రాంతాలను తరలించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సంగీత సత్యనారాయణ ఆదేశించారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రక టన విడుదల చేశారు. రెండు రోజుల నుంచి జిల్లాలో వర్షాలు కురుస్తున్నాయని, గోదావరి, మానేరు నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయని పేర్కొన్నారు. గోదావరికి ఎగువ ప్రాంతం నుంచి సుమారు 4.50 లక్షల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నదని, తీర ప్రాంతంలోని రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని ప్రజలను, మంథని పట్టణం, మండల ప్రాంతంలోని గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. లోయర్‌ మానేరు డ్యామ్‌ నుంచి నీటిని వదులుతున్న నేపథ్యంలో వరద ప్రవాహం పెరుగుతున్నదని అన్నారు. జిల్లాలోని అన్ని మండలాల్లో వర్షాలు పడుతున్నాయన్నా రు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, పంచాయతీ కార్యదర్శులు, మున్సిపల్‌ అధికా రులు, సిబ్బంది అందుబాటులో ఉండి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. చెరువుల వల్ల ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికా రులను ఆదేశించారు. నీటి ప్రవాహం ఉన్న వంతెనల వద్ద ఇరువైపులా రాకపోకలు నిలిపి వేయాలన్నారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నందున ఎలాంటి ప్రాణ నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఎక్కడైనా ఇబ్బందు లు తలెత్తినట్లయితే వెంటనే మండల, జిల్లా స్థాయి అధికారులకు సమాచారం ఇవ్వాలన్నారు. ప్రజలకు అవసరమైన సేవలను అందించేందుకు జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో కంట్రోల్‌ రూమును ఏర్పాటు చేశామని, అత్యవసర పరిస్థితుల్లో నంబర్‌ 7995070702కు సంప్రదించాలన్నారు.

జిల్లాలో 57.7 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం

జిల్లాలో శనివారం రాత్రి నుంచి ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తున్నది. ఉద యం వరకు 57.7 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదయ్యింది. అత్యధికంగా పెద్దపల్లి మండలంలో 99.8, సుల్తానాబాద్‌ 89.2, ఎలిగేడులో 74.5, కాల్వశ్రీరాంపూర్‌ లో 70.4, ధర్మారంలో 61.2, రామగిరిలో 60.0, మంథనిలో 58.2, అంతర్గాంలో 56.5, ముత్తారంలో 53.1, ఓదెలలో 51.4 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షాలకు గోదావరి, మానేరు నదులతో పాటు హుస్సేనిమియా వాగులు ఉప్పొంగుతున్నాయి.

ఎల్లంపల్లికి పోటెత్తిన వరద..

శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద పోటెత్తుతున్నది. ఉదయం నుంచి సాయం త్రం వరకు వరద ప్రవాహం పెరిగింది. ప్రస్తుతం ఎగువ ప్రాంతంలో నుంచి 4,91,780 క్యూసెక్కుల వరద నీరు వస్తుండగా, 40 గేట్ల ద్వారా 4,60,892 క్యూసెక్కు ల నీటిని వదిలిపెడుతున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 20.175 టీఎంసీలు కాగా, 18.841 టీఎంసీలు ఉన్నాయి. దిగువనగల పార్వతి బ్యారేజీ నుంచి 60 గేట్ల ద్వారా 4,10,800 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వర్షాల నేపథ్యంలో గోదావరి, మానేరు తీరప్రాంత ప్రజలను జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తం చేసింది. 

Updated Date - 2022-09-12T04:59:36+05:30 IST