సైదాపూర్‌లో పోరుబాట
ABN , First Publish Date - 2022-11-26T00:00:15+05:30 IST
సైదాపూర్ మండల కేంద్రంలో శక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవీణ్‌రెడ్డి కార్యకర్తలతో కలిసీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై డిప్యూటీ తహసీల్దార్ మల్లేషంకు వినతీపత్రం అందజేశారు.
సైదాపూర్, నవంబరు 25: సైదాపూర్ మండల కేంద్రంలో శక్రవారం కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యలో పోరుబాట కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రవీణ్‌రెడ్డి కార్యకర్తలతో కలిసీ ర్యాలీగా తహసీల్దార్ కార్యాలయం వద్దకు వెళ్లి రైతు సమస్యలపై డిప్యూటీ తహసీల్దార్ మల్లేషంకు వినతీపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఽతెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణీ పోర్టల్‌తో రైతులు నానా ఇబ్బందులు పడుతున్నారన్నారు. వెంటనే ధరణీ పోర్టల్‌ను రద్దు చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రైతులుకు ఎన్నికలల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు ఈ పోరుబాట కార్యక్రమం నిర్వహించామన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు రాఘవులు, చాడ కొండాల్‌రెడ్డి, పోగు రమేష్, మ్యాకల రవిందర్, గోనెల స్వామి తదితరులు పాల్గొన్నారు.