అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను శిక్షించాలి

ABN , First Publish Date - 2022-12-31T23:48:45+05:30 IST

అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను శిక్షించాలని అయ్యప్ప మాలదారులు డిమాండ్‌ చేశారు.శనివారం సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా వద్ద హరిహర పుత్ర అయ్యప్ప దేవాలయ ట్రస్ట్‌, అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను శిక్షించాలి
సిరిసిల్లలో అయ్యప్ప దీక్షాదారుల ఆందోళన

సిరిసిల్ల, డిసెంబరు 31 (ఆంధ్రజ్యోతి):అయ్యప్పస్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌ను శిక్షించాలని అయ్యప్ప మాలదారులు డిమాండ్‌ చేశారు.శనివారం సిరిసిల్ల అంబేద్కర్‌ చౌరస్తా వద్ద హరిహర పుత్ర అయ్యప్ప దేవాలయ ట్రస్ట్‌, అయ్యప్ప సేవా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌కు ర్యాలీగా తరలివచ్చి ఫిర్యాదు చేశారు. హిందువుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఎవరు మాట్లాడినా సహించబోమని హెచ్చరించారు. దేవాలయ ట్రస్ట్‌ చైర్మన్‌, గురుస్వామి రాచ విద్యాసాగర్‌, గురుస్వాములు దుబ్బ విశ్వనాథం, అన్నల్‌దాస్‌ అనిల్‌, ఎర్రం శంకర్‌, కల్లూరి రాజు, గడ్డం భగవాన్‌, బుడిమె ప్రకాష్‌, గడ్డం నాగరాజు, మ్యాన ప్రసాద్‌, కల్లూరి మధు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట : హిందూ దేవతలపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భారత నాస్తిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్‌ను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ హిందూ ఐక్య వేదిక సంఘం ఆధ్వర్యంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో శనివారం ఆందోళన చేపట్టారు. నరేశ్‌ దిష్టిబొమ్మతో కొత్త బస్టాండ్‌ నుంచి పాత బస్టాండ్‌ వరకు ప్రదర్శన నిర్వహించారు. అనంతరం నరేశ్‌ దిష్టిబొమ్మను దహనం చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వ్యాఖ్యలు చేసిన వ్యక్తిపై పీడీ యాక్ట్‌ నమోదు చేయాలని స్థానిక ఎస్సై శేఖర్‌కు వినతి పత్రం అందజేశారు. నాయకులు రాజుయాదవ్‌, సనత్‌రెడ్డి, సందీప్‌రెడ్డి, అనూష్‌యాదవ్‌, కార్తీక్‌రెడ్డి, కిరణ్‌నాయక్‌, వినిత్‌, మహేశ్‌, అరవింద్‌, మధు, చందు, వెంకటేశ్‌ పాల్గొన్నారు.

గంభీరావుపేట : గంభీరావుపేట మండల కేంద్రంలో శనివారం అయ్యప్ప స్వాములు రాస్తారోకో చేశారు. బైరి నరేష్‌ అయ్యప్ప స్వామిని కించపరిచి హిందువుల మనోభావాలను దెబ్బతీశారంటూ అయ్యప్ప స్వాములు బైఠాయించారు. ఆందోళనలో మండలంలోని అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు

వేములవాడ టౌన్‌: హిందూ దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అయ్యప్ప స్వాములు కోరారు. శనివారం పట్టణంలో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోలీస్‌ స్టేషన్‌లో సీఐ వెంకటేష్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప స్వాములు మాట్లాడుతూ హిందు దేవుళ్లను కించపరిచేలా మాట్లాడిన నరేష్‌ను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. అయ్యప్ప గురుస్వాములు బొగోని అంజయ్య, నూగూరి మహేష్‌, రాచర్ల శ్రీనివాస్‌, అద్దెంకి సురేష్‌, అయ్యప్ప స్వాములు, బీజేపీ నాయకులు రేగుల మల్లికార్జున్‌, రేగుల సంతోష్‌బాబు, సంటి మహేష్‌, గడప కిషోర్‌రావు, రాము తదితరులు ఉన్నారు.

కోనరావుపేట : హిందూ మతం, దేవుళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ మండల అధ్యక్షుడు గొట్టె రామచంద్రం డిమాండ్‌ చేశారు. శనివారం ఎస్సై రమాకాంత్‌కు హిందూ సంఘం నాయకుల ఆధ్వర్యంలో ఫిర్యాదు చేశారు. హిందూ మతం, హిందూ దేవుళ్లను ఎవరు కించపరిచినా ఊరుకోబోమన్నారు. కార్యక్రమంలో నాయకులు జవ్వాజి తిరుపతిగౌడ్‌, మిర్యాల్‌కార్‌ బాలాజీ, జలేందర్‌, బెంద్రె శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:48:45+05:30 IST

Read more