ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి

ABN , First Publish Date - 2022-04-06T05:41:14+05:30 IST

అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు.

ఘనంగా బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతి
సిరిసిల్లలో కేక్‌ కట్‌ చేస్తున్న జడ్పీ చైర్‌పర్సన్‌, కలెక్టర్‌, తదితరులు

- అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన సంఘసంస్కర్త

- జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ 

- కుల రహిత సమాజం కోసం కృషి చేసిన మహానీయుడు 

- కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి

సిరిసిల్ల, ఏప్రిల్‌ 5 (ఆంధ్రజ్యోతి): అణగారిన వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మాజీ ఉపప్రధాని డాక్టర్‌ బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా మంగళవారం ఘనంగా నిర్వహించారు. అధికారికంగా ప్రభుత్వ కార్యాలయాల్లో స్థానిక సంస్థల్లో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తా వద్ద  జగ్జీవన్‌రామ్‌ జయంతి నిర్వహించారు. జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి,  ఎస్పీ రాహుల్‌హెగ్డేతో పాటు ప్రజాప్రతినిధులు, అంబేద్కర్‌ సంఘాల ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు జగ్జీవన్‌రామ్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ అరుణ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి  కృషి చేసిన గొప్ప సంఘ సంస్కర్తని బాబు జగ్జీవన్‌రామ్‌ను కొనియాడారు. ఆయన ఆశయ సాధన దిశగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు.  కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి మాట్లాడుతూ కుల రహిత సమాజం కోసం కృషిచేసిన మహానీయుడు బాబు జగ్జీవన్‌రామ్‌ అన్నారు.  అన్ని వర్గాల సమానత్వాన్ని చాటి చెప్పిన జగ్జీవన్‌రామ్‌ను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలన్నారు. భారత ప్రభుత్వం  కేబినేట్‌లో సుదీర్ఘకాలంగా మంత్రిగా, ఉప ప్రధానిగా సేవలు అందించారన్నారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు ఖీమ్యానాయక్‌, సత్యప్రసాద్‌, అదనపు ఎస్పీ చంద్రయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, రైతు బంధు సమితి జిల్లా కో ఆర్డినేటర్‌ గడ్డం నర్సయ్య, ఆర్డీవో టి.శ్రీనివాసరావు, ఎస్సీ సంక్షేమాధికారి భాస్కర్‌, ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ వినోద్‌కుమార్‌, జిల్లా సంక్షేమాధికారి లక్ష్మీరాజం, అంభేద్కర్‌ సంఘాల ప్రతినిధులు, కత్తెర దేవదాస్‌, రాగుల జగన్‌, అకునూరి బాలరాజు, అంకని భాను, రామచంద్రం, కమలాకర్‌, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మున్సిపల్‌ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. మున్సిపల్‌ కార్యాలయంలో బాబు జగ్జీవన్‌రామ్‌ జయంతిని ఘనంగా నిర్వహించారు. జగ్జీవన్‌రాం చిత్రపటానికి చైర్‌పర్సన్‌ జిందం కళ, కమిషనర్‌ సమ్మయ్య, కౌన్సిలర్లు పూలమాలలు వేసి నివాళులు తెలిపారు.  ఈసందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల శ్రేయస్సు కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహానీయుడని అన్నారు. కార్యక్రమంలో  వైస్‌ చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కౌన్సిలర్లు పత్తిపాక పద్మ, గుండ్లపల్లి నీరజ, మాధవి, దార్నం అరుణ, సీమాభేగం, గడ్డం లత, లింగంపల్లి సత్యనారాయణ,  కుడిక్యాల రవికుమార్‌, అన్నారం శ్రీనివాస్‌, కో ఆప్షన్‌ సభ్యుడు సలీం, టీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, మాజీ కౌన్సిలర్‌ పూర్ణచందర్‌, కమలాకర్‌రావు, మధు పాల్గొన్నారు. 

 


Updated Date - 2022-04-06T05:41:14+05:30 IST