అంబరాన్నంటిన అయ్యప్ప ఆరట్టు ఉత్సవం

ABN , First Publish Date - 2022-12-07T00:10:16+05:30 IST

పట్టణంలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవం అంబరాన్నింటింది. పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం ప్ర త్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలను నిర్వహిం చారు.

అంబరాన్నంటిన అయ్యప్ప ఆరట్టు ఉత్సవం
ఉత్సవ విగ్రహాలకు అభిషేకం చేస్తున్న స్వాములు

కోరుట్ల, డిసెంబరు 6 : పట్టణంలో అయ్యప్ప ఆరట్టు ఉత్సవం అంబరాన్నింటింది. పట్టణంలోని అయ్యప్ప స్వామి ఆలయంలో మంగళవారం ప్ర త్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలను నిర్వహిం చారు. పట్టణంలోని బాలాజీ రోడ్డులో ఉన్న ఆంజ నేయ స్వామి దేవాలయంలో ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలను నిర్వహించి మహదేవ స్వామి దేవాలయానికి భజన కార్యక్రమాలతో తరలించారు. మంగళవాయిద్యాలు ఊరేగింపు జరిపారు. స్థానిక మహదేవస్వామి ఆలయం వరకు శోభా యాత్ర జరిపారు. అక్కడ కోనేరులో స్వామి వా రికి జలాభిషేకంతో పాటు పంచామృత అభిషేకా లను వేదపండితులు పాలెపు రాంశర్మ, పాలెపు భరద్వాజ్‌శర్మ మత్సోత్చరల మద్య మహదేవ స్వా మి దేవాలయ ప్రాంగణంలో ఉత్సవ విగ్రహాలకు అయ్యప్ప స్వాములు ప్రత్యేక పూజలు నిర్వహించి అలంకరణ జరిపారు. అక్కడి నుంచి అయ్యప్ప ఆ లయం వరకు కొనసాగింది. అయ్యప్ప దీక్షాపరు లు, భక్తులు, కళాకారులు నృత్యాలు చేస్తూ స్వా మి వారికి స్వాగతం పలికారు. స్వామి వారి రథోత్సవానికి మహిళలు ఇంటి ముందు కల్లాపు చల్లి మంగళహారతులతో స్వాగతం పలికారు. ఈ కా ర్యక్రమంలో అయ్యప్ప జ్ఞాన సరస్వతి దేవాలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్‌, గౌరవ అధ్యక్షుడు చిద్రాల నారాయణ, గురు స్వా ములు రవిగౌడ్‌, గడ్డ మధు, బట్టు హరి కృష్ణ, గట్ట అనంద్‌, శంకర్‌లతో పాటు సభ్యులు, భక్తు లు పాల్గొన్నారు.

రాయికల్‌: అయ్యప్ప ఆరట్టు ఉత్సవం రాయికల్‌లో మంగళవారం కన్నుల పండువగా జరిగింది. స్థానిక అయ్యప్ప ఆలయంలో అయ్యప్పకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ విగ్రహాలను రథంపై ఉంచి ఆలయం నుండి గాంధీచౌక్‌, పాత బస్టాండ్‌ నుంచిపెద్ద చెరువు వరకు శోభాయాత్ర నిర్వహించారు. అయ్యప్ప దీక్షా పరుల నృత్యాలు, శరణుఘోషతో రాయికల్‌ మారుమోగింది. శోభాయాత్రలో మహిళలు మంగళహారతులతో స్వాములకు స్వాగతం పలికారు. ఉత్స వమూర్తులకు పెద్ద చెరువులో చక్రస్నానం అ నంతరం తిరిగి ఆలయానికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప ఆలయ పూజారి మునుగోటి సత్యనారాయణ శర్మ, సాయి శర్మ, గురుస్వాములు సింగని రమేష్‌, మచ్చ శ్రీధర్‌, శ్రవణ్‌, సా యికృష్ణ, పరమేశ్వర్‌, ప్రతాప్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:10:18+05:30 IST