క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి

ABN , First Publish Date - 2022-10-18T05:06:33+05:30 IST

క్రీడాకారులు జాతీయ స్థాయిల్లో రాణిం చాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు.

క్రీడాకారులు జాతీయ స్థాయిలో రాణించాలి
కార్యక్రమంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

రామగిరి, అక్టోబరు 17: క్రీడాకారులు జాతీయ స్థాయిల్లో రాణిం చాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు అన్నారు. సోమవారం సెంటినరీ కాలనీలోని రాణిరుద్రామాదేవి క్రీడా ప్రాంగణంలో మూడు రోజులు గా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి టెన్నికాయిట్‌ చాంపియన్‌షిప్‌ పోటీ ల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యా రు. అనంతరం జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులకు మెడల్స్‌ను ప్రదానం చేశారు. కార్యక్రమానికి విశిష్టఅతిథిగా భూపా ల్‌పల్లి జడ్పీ చైర్‌పర్సన్‌ జక్కు శ్రీహర్షిణి,సర్పంచ్‌ అల్లంపద్మ, మార్కె ట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ పూదరి సత్యనారాయణగౌడ్‌, వైస్‌ఎంపీపీ కాపురబోయిన శ్రీదేవి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శంకేషి రవీం దర్‌, నాయకులు రాజసంపత్‌, రాజన్న, ఆసం తిరుపతి, ఆశాకుమా రి, గీతాబాయ్‌, మైదం స్వప్న, సుభాన్‌, మల్లి, సరీన్‌, అనీల్‌, తిరుప తి, శ్యాంసుందర్‌, క్రీడాకారులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-18T05:06:33+05:30 IST