మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి

ABN , First Publish Date - 2022-09-08T05:51:41+05:30 IST

ప్రజా సమస్యల చర్చించడా నికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని మంథని ఎమ్మెల్యే దు ద్దిళ్ళ శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు.

మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలి
విలేకరులతో మాట్లాడుతున్న శ్రీధర్‌బాబు

- ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్‌బాబు

మంథని, సెప్టెంబరు 7: ప్రజా సమస్యల చర్చించడా నికి రాష్ట్ర ప్రభుత్వం మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని మంథని ఎమ్మెల్యే దు ద్దిళ్ళ శ్రీధర్‌బాబు డిమాండ్‌ చేశారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో బుధవారం శ్రీధర్‌బాబు విలేక రులతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రశ్నించే ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే రాష్ట్ర ప్రభుత్వం అసెం బీ సమావేశాలను కుదించి కేవలం రెండు రోజులకే పరిమితం చేసిందన్నారు. రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొం టున్న ప్రజా సమస్యల చర్చించి పరిష్కారించడానికి మూడు వారాల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వ హించాలని డిమాండ్‌ చేశారు. ఈనెల 12, 13వ తేదీల్లో జరిగే అ సెంబీ సమావేశాల్లో అధికారపక్షం ప్రతిపక్షాలు అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పాలన్నారు. ప్రతిపక్షాలకు స్పీకర్‌ ఎక్కువ సమయం కేటాయించి ప్రజా సమస్యలు ప్రభుత్వం తీసుకుపోవటానికి సహక రించాలన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో అధికారపక్షంలోని వారే ఎక్కు వ సమయం తీసుకుంటూ ప్రజా సమస్యలపై స్పందించే ప్రతిపక్ష పార్టీల నేతలపై ప్రశ్నల రూపంలో ఎదురుదాడి చేస్తున్నారన్నారు. ప్రకృతి వైపరీత్యాలతోపాటు మానవ తప్పిదాల వలన వరదలు సం భవిస్తున్నాయన్నారు. వరద బాధితులకు జాతీయ విపత్తు ద్వారా నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. రాష్ట్రంలో సమ్మె చేస్తున్న వీఆర్‌ఏ లకు గతంలో సీఎం కేసీఆర్‌ ఇచ్చిన హామీ ఇచ్చిన కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. సింగరేణి సంస్థలో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులకు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించడానికి సీఎం చర్యలు తీసుకోవాన్నారు. వారి సంస్థ లాభాల్లో బోనస్‌, ఈ ఎస్‌ఐ సదుపాయం కల్పించాలన్నారు. చిన్నకాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేయడం తోపాటు రైతులకు సాగునీటి కోసం గోదావరినదిపై లిఫ్టు లు ఏర్పాటు చేయాలన్నారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్‌ వరకు రాహుల్‌గాంధీ చేపట్టిన 3500 కిలోమీటర్ల జోడో భారత్‌పాదయాత్ర తెలంగాణ రాష్ట్రంలో కొనసాగే సమయంలో ప్రజలు, పార్టీ శ్రేణులు విజయవంతం చేయాలని శ్రీధర్‌బాబు కోరారు. ఏన్‌డీఏ పాలన దేశంలో ప్రజలు అనేక సమస్యలు ఎర్కొంటున్న నేపథ్యంలో బడుగు బలహీన వర్గాల ప్రజలందరికి అండా ఉన్నామన్న భరోసా కల్పించ డానికి రాహుల్‌గాంధీ ఈ పాదయాత్ర చేపట్టారన్నారు. రాహుల్‌ గాంధీ పాదయాత్ర విజయవంతం కోసం సర్వమత ప్రార్థనలు చే యించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ నేతలు సెగ్గెం రాజేష్‌, తోట్ల తిరుపతియాదవ్‌, పెండ్రు రమ, చొప్పకట్ల హన్ముంతు, రావికంటి సతీష్‌, పోలు శివ, జంజర్ల శేఖర్‌, రాజయ్య, బాలజీ, లింగయ్య యాదవ్‌, గోటికారి కిషన్‌జీ పాల్గొన్నారు.  

Read more