సెస్‌ ఎన్నికపై ఆశావహుల దృష్టి

ABN , First Publish Date - 2022-12-07T01:14:20+05:30 IST

సెస్‌ పరిధిలో 15 డివిజన్లకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించడంతో అశావాహులు తమ మద్ధతుదారులను కూడగట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. పార్టీలకు అతీతంగా జరిగే సహకార ఎన్నికల్లో పార్టీ గుర్తుల ప్రమేయం బీఫాంలు లేకపోవడం, ఖర్చుకు నియంత్రణ లేకపోవడంతో ఎక్కువ మొత్తంలోనే ఖర్చుచేసే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు.

సెస్‌ ఎన్నికపై ఆశావహుల దృష్టి

- అధికార పార్టీలో మొదలైన హడావుడి

- బలమైన అభ్యర్థులను దించే యోచనలో బీజేపీ, కాంగ్రెస్‌

- సెస్‌ పరిఽధిలో 87,130 మంది ఓటర్లు

- ఓటరు లిస్టు అస్తవ్యస్తంపై ఫిర్యాదులు

- జోరందుకున్న సిరిసిల్ల సహకార రాజకీయం

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)

సెస్‌ పరిధిలో 15 డివిజన్లకు సంబంధించి రిజర్వేషన్లు ప్రకటించడంతో అశావాహులు తమ మద్ధతుదారులను కూడగట్టుకునే ప్రయత్నం మొదలు పెట్టారు. పార్టీలకు అతీతంగా జరిగే సహకార ఎన్నికల్లో పార్టీ గుర్తుల ప్రమేయం బీఫాంలు లేకపోవడం, ఖర్చుకు నియంత్రణ లేకపోవడంతో ఎక్కువ మొత్తంలోనే ఖర్చుచేసే అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. ఓటర్లకు డబ్బులు, మద్యం పంపిణీ భారంగానే మారుతుందనే భయం కూడా ఆశావాహుల్లో నెలకొంది. పార్టీల ప్రమేయం లేకపోయినా ఒకే పార్టీ నుంచి అభ్యర్థులు బరిలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. పార్టీల మద్దతు ఇచ్చినా పూర్తిస్థాయిలో నాయకులు సహకరించకపోవచ్చనే అనుమానాలు కూడా అభ్యర్థుల్లో నెలకొన్నాయి. ప్రధానంగా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో ఆశావహుల తాకిడి ఎక్కువగా ఉంది. మహిళ, ఎస్సీ, రిజర్వేషన్లలో అభ్యర్థుల ఎంపిక కొంత సులువుగా ఉన్నా జనరల్‌ స్థానాల్లో మాత్రం తీవ్ర పోటీ నెలకొంటుందని భావిస్తున్నారు. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఆర్థికంగా ఉన్న అభ్యర్థులనే బరిలోకి దింపే అలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ మద్దతు లేకపోయినా బరిలో నిలవడానికి కూడా ఆర్థికంగా ఉన్నవారు సిద్ధమవుతున్నారు. మరికొందరు చైర్మన్‌ అవకాశం ఉంటేనే డైరెక్టర్‌గా పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. టీఆర్‌ఎస్‌లో మంత్రి కేటీఆర్‌, వేములవాడ ఎమ్మెల్యే రమేష్‌బాబు, నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌రావు, టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్యతో పాటు జిల్లాలోని ముఖ్య నాయకులు చుట్టూ ఆశావాహులు పోటీకి సిద్ధమంటూ తిరుగుతున్నారు.

ఫ మహిళ అభ్యర్థుల్లో ఎవరికో అవకాశం..

సిరిసిల్ల సహకార విద్యుత్‌ సరఫరా సంఘం పరిధిలో 15 డివిజన్లలో సిరిసిల్ల టౌన్‌-1, వేములవాడ టౌన్‌-1 మహిళలకు జనరల్‌ కేటగిరీగా రిజర్వేషన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు ఆ రెండు డివిజన్లలో పోటీకి సిద్ధమైన వారిలో నిరాశ ఎదురైంది. కనీసం వారి సతీమణులను రంగంలోకి దింపాలని భావించినా వారికి ఓటు హక్కు ఉండాలి. టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో ఉన్న నాయకుల పేర్లపైనే ఓటు హక్కు ఉండడంతో వారి సతీమణులు పోటీ చేసే అవకాశం లేకుండా పోవడంతో నిరాశ చెందుతున్నారు. ఎవరికి అవకాశం లభిస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. సిరిసిల్లలో టౌన్‌- 1 మహిళ రిజర్వ్‌ స్థానం నుంచి మున్సిపల్‌ మాజీ చైర్‌పర్సన్‌ గుడ్ల మంజుల తెరపైకి వచ్చారు. కాంగ్రెస్‌ మద్ధతుతో బరిలో నిలవనున్నట్లు చర్చించుకుంటున్నారు. వేములవాడ టౌన్‌ - 1లో మహిళ అభ్యర్థులపై అయోమయమే ఏర్పడింది. కొత్తవారికి అవకాశాలు ఏర్పడుతాయని భావిస్తున్నారు. బోయినపల్లి జనరల్‌ ఎస్సీ రిజర్వు కావడంతో అ సామాజిక వర్గంలోని నాయకుల్లో పోటీ ఏర్పడింది. సిరిసిల్ల టౌన్‌ 2, వేములవాడ టౌన్‌ 2, వేములవాడ రూరల్‌, కోనరావుపేట, రుద్రంగి, చందుర్తి, వీర్నపల్లి, ఎల్లారెడ్డిపేట, ముస్తాబాద్‌, గంభీరావుపేట, ఇల్లంతకుంట, తంగళ్లపల్లి మండలాలు ఓపెన్‌ కేటగిరీలో ఉన్నాయి. దీంతో అన్నీ పార్టీలు ఈ మండలాలపై ప్రత్యేక దృష్టి సారించాయి.

ఫ అస్తవ్యస్తంగా ఓటరు జాబితా..

సిరిసిల్ల సెస్‌ పరిఽధిలో 2.81 లక్షల సర్వీసులు ఉండగా ఓటర్లు కేవలం 87130 మంది ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఓటరు జాబితా అస్థవ్యస్థంగా మారిందని తంగళ్లపల్లి మండలంలోని పలు గ్రామాలకు చెందిన ఓట్లు కూడా టౌన్‌ - 2లోకి వచ్చాయని, వేములవాడ అర్భన్‌ మండలంలో ఉన్న రెండు గ్రామాల ఓట్లను వేములవాడ టౌన్‌- 1లో కలిపారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ మహిళలకు న్యాయం చేయకుండా రెండు మహిళలకు కేటాయించడంపై అధికారులకు ఫిర్యాదు చేశారు. రిజర్వేషన్లు కూడా చట్టబద్ధంగా లేవని బీజేపీ జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు అందించారు. సిరిసిల్ల పట్టణంలో కూడా ఓట్లు గల్లంతయ్యాయనే అందోళనలు వ్యక్తం అవుతున్నాయి. హడావిడిగా సమగ్రంగా జాబితాలు సిద్ధం చేయాలనే అరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఫ ఆశావహులు వీరే..

సిరిసిల్ల సహాకార ఎన్నికల్లో పోటీకి సిద్ధమైన అశావాహులు టీఆర్‌ఎస్‌, బీజేపీ, కాంగ్రెస్‌ నాయకుల చుట్టూ మద్ధతు పొందడానికి చక్కర్లు కొడుతున్నారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు దీటుగా గెలుపు కైవసం వైపు బీజేపీ, కాంగ్రెస్‌ దృష్టి సారించాయి. టీఆర్‌ఎస్‌ పార్టీలో అభ్యర్థుల పోటీ తీవ్రంగా కనిపిస్తుంది.

- సిరిసిల్ల టౌన్‌ - 1 మహిళ రిజర్వేషన్‌ కావడంతో కాంగ్రెస్‌ నుంచి మాజీ చైర్‌పర్సన్‌ గుడ్ల మంజుల తెరపైకి రాగా, టీఆర్‌ఎస్‌, బీజేపీ నుంచి అశావాహూలు ముందుకు రాలేదు.

- సిరిసిల్ల టౌన్‌-2 నుంచి టీఆర్‌ఎస్‌ నుంచి ఇప్పటికే మద్ధతుదారులను కూడగట్టుకోవడంతో సిరిసిల్ల బీసీ సంఘం నాయకుడు బొల్లి రామ్మోహన్‌ ముందు వరుసలో ఉండగా అర్బన్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌ దార్నం లక్ష్మీనారాయణ, మాజీ కౌన్సిలర్‌ యెల్లె లక్ష్మీనారాయణ, దడిగెల శ్రావణ్‌రావు, కాంగ్రెస్‌ నుంచి నాగుల సత్యనారాయణ, సంగీతం శ్రీనివాస్‌, బీజేపీ నుంచి అభ్యర్థుల ఎంపిక పక్రియ ఇంకా మొదలు కాలేదు.

- ఇల్లంతకుంటలో టీఆర్‌ఎస్‌ నుంచి కేవీఎన్‌ రెడ్డి, రవీందర్‌రెడ్డి, అయిలయ్య యాదవ్‌, బీజేపీ నుంచి బెంద్రం తిరుపతిరెడ్డి, స్వతంత్రులుగా బద్దం రమణారెడ్డి, ఒగ్గు నర్సయ్యయాదవ్‌, గుర్రం భూపతిరెడ్డి

- ఎల్లారెడ్డిపేటలో టీఆర్‌ఎస్‌ నుంచి మాజీ సర్పంచ్‌ నేవూరి మమతరెడ్డి, సెస్‌ మాజీ డైరెక్టర్‌ కుంభాల మల్లారెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొండ రమేష్‌గౌడ్‌, అందె సుభాష్‌, నర్సింహారెడ్డి, మాజీ ఎంపీపీ వరుస కృష్ణహారి, మండల పరిషత్‌ వైస్‌ చైర్మన్‌ కదిరె భాస్కర్‌, బీజేపీ నుంచి మద్దుల బుగ్గారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి మండల అధ్యక్షుడు దొమ్మాటి నర్సయ్య, బీఎస్పీ నుంచి నీరటి భాను బరిలో నిలవడానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

- కోనరావుపేటలో టీఆర్‌ఎస్‌ నుంచి దేవరకొండ తిరుపతి, కాంగ్రెస్‌ నుంచి కేతిరెడ్డి జగన్మోహన్‌రెడ్డి, బీజేపీ నుంచి గోపాడి సురేందర్‌రావు, బీఎస్పీ నుంచి పల్లం సత్తయ్య

- వీర్నపల్లిలో టీఆర్‌ఎస్‌ నుంచి ఎడ్ల సాగర్‌, మాడుగుల మల్లేశం, గుజ్జుల రాజిరెడ్డి, గుండ చిన్నమల్లేశం, బీజేపీ నుంచి బూరుగుల దేవేందర్‌రెడ్డి, బోడ మల్లేశం, కుప్పాల శ్రీనివాస్‌, కాంగ్రెస్‌ నుంచి బూత శ్రీనివాస్‌, టీడీపీ నుంచి భూక్య గజన్‌లాల్‌ల పేర్లు తెరపైకి వచ్చాయి.

- తంగళ్లపల్లి నుంచి సెస్‌ మాజీ చైర్మన్‌ చిక్కాల రామారావు, మాజీ ఎంపీపీ గజభీంకార్‌ రాజన్న, బైరి రమేష్‌, విజయేందర్‌రెడ్డి, బీజేపీ నుంచి మాజీ ఎంపీపీ రేగులపాటి సుభాష్‌రావు, కాంగ్రెస్‌ నుంచి మండల అధ్యక్షుడు జాల్గం ప్రవీణ్‌కుమార్‌

- బోయినపల్లిలో టీఆర్‌ఎస్‌ నుంచి కొత్తపల్లి సుధాకర్‌, కవ్వంపల్లి రాములు, కట్ట లక్ష్మణ్‌, బీజేపీ నుంచి జోగు రవీందర్‌, కాంగ్రెస్‌ నుంచి బోలుమాల శంకర్‌

- గంభీరావుపేటలో టీఆర్‌ఎస్‌ నుంచి గౌరినేని నారాయణరావు, పాపగారి వెంకటస్వామి గౌడ్‌, గడ్డమీది శ్రీకాంత్‌రెడ్డి అక్కపల్లి రాజనర్సింహారెడ్డి, లక్కిరెడ్డి కమాలాకర్‌రెడ్డి, కుమ్మరి రాజారాం, బీజేపీ నుంచి గంట అశోక్‌, దేవసాని కృష్ణ, గడ్డమీది ప్రసాద్‌రెడ్డి, మద్దుల రాజిరెడ్డి, కాంగ్రెస్‌ నుంచి హామీద్‌, మల్యాల రాజవీరు, స్వతంత్రుడుగా విద్యాసాగర్‌రెడ్డి

- వేములవాడ టౌన్‌-2 స్థానంలో టీఆర్‌ఎస్‌ నుంచి రేగులపాటి హరిచరణ్‌రావు, ఊరడి ప్రవీణ్‌కుమార్‌, కాంగ్రెస్‌ నుంచి పిల్లి కనకయ్య, బీజేపీ నుంచి బుర్ర శేఖర్‌, గాలిపల్లి స్వామి,

- ముస్తాబాద్‌లో టీఆర్‌ఎస్‌ నుంచి కల్వకుంట్ల గోపాల్‌రావు, సందుపట్ల అంజిరెడ్డి, చీటి జితేందర్‌రావు, బీజేపీ నుంచి మట్ట వెంకటేశ్వర్‌రెడ్డి, హన్మంతుగౌడ్‌, కాంగ్రెస్‌ నుంచి ఏల్ల బాల్‌రెడ్డి,

- వేములవాడ రూరల్‌ టీఆర్‌ఎస్‌ నుంచి ఏనుగు మనోహర్‌రెడ్డి, గడ్డం హాన్మండ్లు, అకుల దేవరాజు, కాంగ్రెస్‌ నుంచి సోయినేని కరుణాకర్‌, వకుళాభరణం శ్రీనివాస్‌, బీజేపీ నుంచి జక్కుల తిరుపతి

- రుద్రంగిలో టీఆర్‌ఎస్‌ నుంచి అకుల గంగారాం, బండారి నర్సయ్య, కేసిరెడ్డి నర్సారెడ్డి, కాంగ్రెస్‌ నుంచి సామ మోహన్‌రెడ్డి, చెలుకల తిరుపతి, ధర్నా మల్లేశం, మాడిశెట్టి ప్రభాకర్‌, గడ్డం శ్రీనివాసరెడ్డి, ఎర్రం గంగనర్సయ్య, బీజేపీనుంచి నంద్యాడపు వెంకటేష్‌, రాసూరి నర్సారెడ్డి, బోయిని రాజు, టీడీపీ నుంచి ఇప్ప మహేష్‌, స్వతంత్రులుగా అల్లాడి నళిని, అల్లూరి సంతోష్‌రెడ్డి

- చందుర్తిలో టీఆర్‌ఎస్‌ నుంచి పొన్నాల శ్రీనివాసరావు, మ్యాకల ఎల్లయ్య, కాంగ్రెస్‌ నుంచి అచ్చ శ్రీహరిరెడ్డి, ముస్కు ముకుందరెడ్డి, పులి సత్తయ్య, బీజేపీ నుంచి మారుత సత్తయ్య, చిలుక పెంటయ్య, స్వతంత్రుడిగా సెస్‌ మాజీ చైర్మన్‌ అల్లాడి రమేష్‌ బరిలో నిలవనున్నారని చర్చలు సాగుతున్నాయి. మరికొందరు సెస్‌ చైర్మన్‌ పదవిపైనే ప్రధానంగా దృష్టి పెట్టారు. టీఆర్‌ఎస్‌లో మంత్రి కేటీఆర్‌ చైర్మన్‌ అవకాశం ఇస్తేనే రంగంలోకి రావడానికి సిద్ధమవుతున్న వారు ఉన్నారు.

Updated Date - 2022-12-07T01:14:29+05:30 IST