అర్వింద్‌ మాటలు హాస్యాస్పదం

ABN , First Publish Date - 2022-12-31T23:34:43+05:30 IST

రోళ్లవాగు ప్రాజెక్టుపై కనీస పరిజ్ఞానం లేకుండా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉ న్నాయని ఎమ్మెల్యే డాక్టరు సంజయ్‌కుమార్‌ అన్నారు.

అర్వింద్‌ మాటలు హాస్యాస్పదం
మాట్లాడుతున్న ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌

సారంగాపూర్‌, డిసెంబరు, 31: రోళ్లవాగు ప్రాజెక్టుపై కనీస పరిజ్ఞానం లేకుండా ఎంపీ ధర్మపురి అర్వింద్‌ మాట్లాడిన మాటలు హాస్యాస్పదంగా ఉ న్నాయని ఎమ్మెల్యే డాక్టరు సంజయ్‌కుమార్‌ అన్నారు. శనివారం సాయం త్రం మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రోళ్ల వాగు ప్రాజెక్టులో కేంద్రం వాటా ఒక్క రూపాయి కూడ లేదని, సీఎం కేసీఆర్‌, కాళే శ్వరం, రోళ్లవాగు ప్రాజెక్టుపైన అవగాహన లేని మాటలని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు గుర్రాల రాజేందర్‌రెడ్డి, జడ్పీటీసీ మనోహర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ సురేందర్‌, ఎంపీటీసీ సుధాకర్‌రావు, మాజీ స ర్పంచ్‌లు బల్మూరి నారాయణ రావు, తోడేటి శేఖర్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Updated Date - 2022-12-31T23:34:43+05:30 IST

Read more