మానేరు రివర్‌ఫ్రంట్ పనుల ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేయండి
ABN , First Publish Date - 2022-03-05T06:18:10+05:30 IST
కరీంనగర్‌కు తలమానికంగా నిలిచే మానేరు రివర్ ఫ్రంట్ పనుల ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు.
- మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్ టౌన్, మార్చి 4: కరీంనగర్‌కు తలమానికంగా నిలిచే మానేరు రివర్ ఫ్రంట్ పనుల ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఎల్‌ఎండీ ఇరిగేషన్ కార్యాలయంలో మానేరు రివర్ ఫ్రంట్ ప్రారంభోత్సవంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రివర్ ఫ్రంట్ ప్రారంభోత్సవం తేదీ, స్థలం, ఇతరత్రా అంశాలపై చర్చించి, త్వరలోనే సీఎం చేతుల మీదుగా జరిగే ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు వేగంగా పూర్తిచేయాలని ఆదేశించారు.