పాలిసెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

ABN , First Publish Date - 2022-06-25T06:51:09+05:30 IST

ఈ నెల 30వ తేదీ జరిగే పాలిసెట్‌కు పకడ్బం దీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానా యక్‌ అధికారులను ఆదేశించారు.

పాలిసెట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
అధికారులతో మాట్లాడుతున్న అదనపు కలెక్టర్‌


- అదనపు కలెక్టర్‌ ఖీమ్యానాయక్‌

సిరిసిల్ల కలెక్టరేట్‌, జూన్‌ 24: ఈ నెల 30వ తేదీ జరిగే పాలిసెట్‌కు పకడ్బం దీ ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్‌ ఖీమ్యానా యక్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రం లోని కలెక్టరేట్‌లోని అదనపు కలెక్టర్‌ ఛాంబర్‌లో శుక్రవా రం సంబంధిత అధికారుల తో సమావేశం నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా తొమ్మిది పరీక్ష కేంద్రాల్లో మొత్తం 1929 మంది విద్యార్థులు పాలిసెట్‌ రాయనున్నారని తెలిపారు. ఈ పరీక్షల నిర్వహణకు అవసరమైన ఇన్విజిలేటర్లను నియమించాలని జిల్లా విద్యాధికారిని ఆదేశించారు. అన్ని పరీక్ష కేంద్రాల్లో వైద్య అరోగ్య శాఖ సిబ్బందిని ఏర్పాటు చేసి అన్ని పరీక్ష కేంద్రాల్లో శానిటేషన్‌తోపాటు తాగునీటి సౌకర్యా లను కల్పించాలని మున్సిపల్‌ కమిషనర్‌కు సూచిం చారు. పరీక్షలు జరుగుతున్న సమయంలో కరెంట్‌ కోతలేకుండా చూడాలని సెస్‌ అధికారులను ఆదేశిం చారు. విద్యార్థులకు సరిపడా బస్సులను అందుబాటు లో ఉంచాలని సూచించారు. పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్‌ను విధించాలని పోలీసులకు సూచించారు. సమావేశంలో పాలిసెట్‌ జిల్లా కోఅర్డినేటర్‌ డాక్టర్‌ బి రాజగోపాల్‌, జిల్లా విద్యాధికారి రాఽధాకిషన్‌, జిల్లా వైద్యాధికారి డాక్టర్‌ సుమన్‌మోహన్‌రావు, సిరిసిల్ల మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, సిరిసిల్ల జిల్లా పౌర సంబంధాల అధికారి మామిండ్ల దశరథం, అర్టీసీ డిపో మేనేజర్‌లు బాలకృష్ణ, భీంరెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-25T06:51:09+05:30 IST