వైభవంగా అమ్మవారి తెప్పోత్సవం

ABN , First Publish Date - 2022-10-05T05:57:27+05:30 IST

వేములవాడ రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంలో మంగళవారం రాత్రి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు.

వైభవంగా అమ్మవారి తెప్పోత్సవం
ధర్మగుండంలో అమ్మవారి తెప్పోత్సవం

వేములవాడ, అక్టోబరు 4: వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారి క్షేత్రంలో మంగళవారం రాత్రి తెప్పోత్సవం వైభవంగా నిర్వహించారు.  శరన్నవరాత్రోత్సవాలలో భాగంగా ఉదయం, సాయంత్రం అమ్మవారికి ప్రత్యేక పూజల అనంతరం సిద్దిదా అలంకారంలో అమ్మవారు దర్శనమిచ్చారు. అనంతరం వేద మంత్రోచ్ఛారణల  మధ్య రాజరాజేశ్వరిదేవి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపుగా ఆలయ ధర్మగుండం వరకు తీసుకువెళ్లి విద్యుద్దీపాలతో హంస ఆకారంలో రూపొందించిన ప్రత్యేక తెప్పపై ఉంచి తెప్పోత్సవం నిర్వహించారు. ఘనంగా సాగిన ఈ తెప్పోత్సవ కార్యక్రమాన్ని తిలకించడానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ఏఈవో బి.శ్రీనివాస్‌, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, టీఆర్‌ఎస్‌ నేత ఏనుగు మనోహర్‌రెడ్డి, ఆలయ అధికారులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

Read more