ఖనిలో గడపగడపకు అంబేద్కర్‌

ABN , First Publish Date - 2022-04-11T06:07:45+05:30 IST

ఆలిండియా అంబేద్కర్‌ యువజన సంఘం, తెలం గాణ అంబేద్కర్‌ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి రామగుండం కార్పొరేషన్‌లోని 25వ డివిజన్‌లో గడపగడపకు అంబేద్కర్‌ కార్యక్రమం నిర్వహించారు.

ఖనిలో గడపగడపకు అంబేద్కర్‌
గడపగడపకు అంబేద్కర్‌ కార్యక్రమాన్ని ప్రారంభించిన మేయర్‌ అనిల్‌కుమార్‌

కోల్‌సిటీటౌన్‌, ఏప్రిల్‌ 10: ఆలిండియా అంబేద్కర్‌ యువజన సంఘం, తెలం గాణ అంబేద్కర్‌ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి రామగుండం కార్పొరేషన్‌లోని 25వ డివిజన్‌లో గడపగడపకు అంబేద్కర్‌ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కార్పొరేషన్‌ మేయర్‌ అనిల్‌ కుమార్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అంబేద్కర్‌ చిత్రపటంతో దళిత, బహుజనుల అభివృద్ధి కోసం రాజ్యాంగ నిర్మాత అంబేద్కదర్‌ చేసిన త్యాగాన్ని, కృషి ఇంటింటికి వివరించారు. అనంతరం డిప్యూటీ మేయర్‌ నడిపెల్లి అభిషేక్‌ రావు సహకారంతో అన్నదానం నిర్వహించారు. ఆలిండియా అంబేద్కర్‌ సంఘం జిల్లా గౌరవ అధ్యక్షులు మైసరాజేష్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో కార్పొ రేటర్లు నగునూరి సుమలతరాజు, ఇంజపురి పులేందర్‌, అంబేద్కర్‌ సంఘం నాయకులు బొంకూరి మధు, కొంకటి లక్ష్మణ్‌, కాంపెల్లి సతీష్‌, మంతెన లింగ య్య, వెంకటేష్‌, చిరంజీవి, గొర్రె రమేష్‌, వెంకన్న, మండ రమేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2022-04-11T06:07:45+05:30 IST