నిరవధిక నిరాహార దీక్ష వాయిదా

ABN , First Publish Date - 2022-07-11T05:58:45+05:30 IST

సింగరేణి కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలపై ఈనెల 11 నుంచి ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఈనెల 20కి వాయిదా వేస్తున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్య క్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు.

నిరవధిక నిరాహార దీక్ష వాయిదా
సమావేశంలో మాట్లాడుతున్న తుమ్మల రాజారెడ్డి

- సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు తుమ్మల రాజారెడ్డి  

గోదావరిఖని, జూలై 10 : సింగరేణి కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలపై ఈనెల 11 నుంచి ఆర్‌జీ-1 జీఎం కార్యాలయం ఎదుట తలపెట్టిన నిరవధిక నిరాహార దీక్షను ఈనెల 20కి వాయిదా వేస్తున్నట్టు సీఐటీయూ రాష్ట్ర అధ్య క్షుడు తుమ్మల రాజారెడ్డి తెలిపారు. ఆదివారం స్థానిక శ్రాఇమక భవన్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లా డుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ 2017లో ఇచ్చిన హామిలు మారుపేర్ల సరి, ఉద్యోగ వయోపరిమితి పెంపు, కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 11న జీఎం కార్యాలయం ఎదుట నిరవధిక దీక్షను వాయిదా వేసినట్టు, భారీ వర్షాలు పడుతున్న దృష్ట్యా ఈ దీక్షను 20కి వాయిదా వేసినట్టు తెలిపారు. ఈ సమావేశంలో నాయకులు మెండె శ్రీనివాస్‌, మేదరి సారయ్య, ఆరెపల్లి రాజమౌళి, ఉల్లి మొగిలి, వెంకన్న, కొమురయ్య, తోట నరహరిరావు, రాజేందర్‌, బాలాజీ, చంద్రశేఖర్‌ పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-11T05:58:45+05:30 IST