అంతర్గాం మండలంలో అదనపు కలెక్టర్ పర్యటన
ABN , First Publish Date - 2022-06-29T06:01:53+05:30 IST
అంతర్గాం మండలంలోని పెద్దంపేట, పొట్యాల గ్రామాల్లో మంగళవారం అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా పర్యటించారు.
అంతర్గాం, జూన్ 28: అంతర్గాం మండలంలోని పెద్దంపేట, పొట్యాల గ్రామాల్లో మంగళవారం అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ఆకస్మికంగా పర్యటించారు. ఈ సంద ర్భంగా ఆయా గ్రామాల్లోని నర్సరీలు, స్మశాన వాటికలు సందర్శించారు. గ్రామాల్లోని ప్రధాన వీధుల్లో తిరిగి శానిటేషన్ నిర్వహణ తీరును పరిశీలించి మాట్లాడారు. హరితహారానికి సరిపడే మొక్కలు అందుబాటులో ఉంచుకోవాలని, స్మశాన వాటిక ల్లో మొక్కలు విరివిగా నాటి సుందరవనంగా తీర్చిదిద్దాలని సూచించారు. గ్రామాల్లో పారిశుధ్య పనులు మరింత మెరుగ్గా చేపట్టి ప్రజలకు వ్యాధులు ప్రబలకుండా పరి శుభ్రతను నెలకొల్పాలని పంచాయతీ కార్యదర్శులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో ఎంపీడీఓ బీ యాదగిరి, సర్పంచ్ మేరుగు భాగ్యమ్మగురువయ్యగౌడ్, పంచాయ తీ కార్యదర్శులు గంగలక్ష్మి, రమ్య పాల్గొన్నారు.