అదనపు తూకానికి పాల్పడ్డ రైస్‌ మిల్లర్లపై చర్యలు

ABN , First Publish Date - 2022-11-25T00:16:51+05:30 IST

ధాన్యం సేకరణలో రైస్‌ మిల్లర్లు, ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరా అధి కారి చందన్‌ కుమార్‌ అన్నారు.

అదనపు తూకానికి పాల్పడ్డ రైస్‌ మిల్లర్లపై చర్యలు
ధాన్యం కొనుగోళ్లను పర్యవేక్షిస్తున్న డీఎస్‌వో

చందన్‌ కుమార్‌, జిల్లా పౌరసరఫరా అధికారి

‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన

జగిత్యాల, నవంబరు 24 (ఆంధ్రజ్యోతి): ధాన్యం సేకరణలో రైస్‌ మిల్లర్లు, ఏజెన్సీలు అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని జిల్లా పౌరసరఫరా అధి కారి చందన్‌ కుమార్‌ అన్నారు. ఈనెల 24వ తేదిన ‘ఆంధ్ర జ్యోతి’ దిన పత్రిక లో వచ్చిన ‘దోపిడికి అడ్డుకట్ట ఏదీ..?’ అన్న శీర్షికన వచ్చిన కథనానికి అధికా రులు స్పందించారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో జరుగుతున్న ధాన్యం కొనుగో ళ్లను పర్యవేక్షించిన అనంతరం డీఎస్‌వో మాట్లాడారు. కోరుట్ల పట్టణంలోని ఉ దయ్‌ కుమార్‌ రారైస్‌ మిల్లుపై వరి ధాన్యం కోతలకు గురయినట్లుగా వచ్చి న ఆరోపణలపై విచారణ జరిపామన్నారు. సంబందిత రైస్‌మిల్లులో ట్రక్‌ చి ట్టీలు పరిశీలించిన సందర్బంగా కేంద్రం నుంచి కేటాయించిన ధాన్యం కన్నా అదనం గా ధాన్యం దిగుమతి చేసినట్లుగా తేలిందన్నారు. నిబంధనలకు విరుద్ధంగా సంచికి 43 కిలోల వరి ధాన్యాన్ని మిల్లరు దిగుమతి చేసుకున్నట్లుగా విచార ణలో గుర్తించామన్నారు. సంబంధిత రైస్‌ మిల్లు ఇక ముందు సీఎంఆర్‌లో పా ల్గొనకుండా బ్లాక్‌ లిస్టులో చేర్చామన్నారు. ఎకిన్‌పూర్‌కు చెందిన సాయి రైస్‌ ఇండస్ట్రీస్‌ బాయిల్డ్‌ రైస్‌ మిల్లును సైతం బ్లాక్‌ లిస్టులో పెట్టామన్నారు. జిల్లా లోని పలు మిల్లులపై వస్తున్నఆరోపణలను ఎప్పటికప్పుడు విచారించి తగు నివేదిక ఇవ్వాలని తాజాగా కలెక్టర్‌ రవి నాయక్‌ ఆదేశించారన్నారు. ఎట్టి పరి స్థితుల్లోనూ ధాన్యం కొనుగోళ్లలో ఇన్‌చార్జీలు కానీ, మిల్లర్లు కానీ రైతులను ఇ బ్బందులకు గురిచేస్తే ఊపేక్షించవద్దని సూచించారన్నారు. ధాన్యం కొనుగోళ్ల పై అదనపు తూకం జరగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని క లెక్టర్‌ ఆదేశించారని తెలిపారు. రైతులకు ఇబ్బందులు ఎదురైనా టోల్‌ ఫ్రీ నం బరు 18004258187కు కాల్‌ చేసి ఫిర్యాదు చేయాలని సూచించారు.

Updated Date - 2022-11-25T00:16:51+05:30 IST

Read more