సోషల్‌ మీడియా వేదికగా రెచ్చగొట్టే వారిపై చర్యలు

ABN , First Publish Date - 2022-08-04T05:46:57+05:30 IST

సోషల్‌ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టి రాజకీయ, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ పేర్కొన్నారు.

సోషల్‌ మీడియా వేదికగా రెచ్చగొట్టే వారిపై చర్యలు
మాట్లాడుతున్న ఏసీపీ గిరిప్రసాద్‌

- గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌

కోల్‌సిటీ, ఆగస్టు 3: సోషల్‌ మీడియా వేదికగా అసభ్యకరమైన పోస్టులు పెట్టి రాజకీయ, మత విద్వేషాలను రెచ్చగొట్టే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని గోదావరిఖని ఏసీపీ గిరిప్రసాద్‌ పేర్కొన్నారు. బుధవారం గోదావరిఖని సింగరేణి ఇల్లందు క్లబ్‌లో మంథని నియోజకవర్గంలోని మంథని, ముత్తారం, రామగిరి మండ లాలకు చెందిన సోషల్‌మీడియా ఇన్‌చార్జిలను, సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా పోస్టులు పెట్టే వారిని పిలిచి ఏసీపీ కౌన్సెలింగ్‌ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సోషల్‌ మీడియాను చెడుకు ఉపయోగించి తప్పుడు సమాచారం గ్రూప్‌లో షేర్‌ చేయవద్దని, వ్యక్తిగత దూషణలు చేయవద్దన్నారు. ప్రజాశాంతికి భంగం కలిగించే విధంగా పోస్టులు పెట్టడాన్ని ఉపేక్షించేది లేదన్నారు. ఇలాంటి పోస్టులు పెట్టడం వెంటనే ఆగిపోవాలని, లేనిపక్షంలో కఠిన చర్యలు తప్పవన్నారు. ఫేక్‌ అకౌంట్లు క్రియేట్‌ చేసి అసభ్యంగా రెండు వర్గాల మధ్య చిచ్చుపెట్టే విధంగా ఉన్న పోస్టులను తీసివేయాలని, అకౌంట్లను మూసివేయాలని హెచ్చరించారు. కొంతమంది వ్యక్తిగత లబ్ధి, స్వలాభం కోసం రెండు వర్గాలు గొడవపడేలా, వైష మ్యాలు ఏర్పడే విధంగా సోషల్‌మీడియాలో సందేశాలను అప్‌లోడ్‌ చేస్తున్నారన్నా రు. అలాంటి ఖాతాలపై పోలీసులు నిఘా ఉంచుతారని, ఇలాంటి సమాచారాన్ని షేర్‌చేసే వ్యక్తులపై కూడా కేసులు నమోదు చేస్తామన్నారు. 

Updated Date - 2022-08-04T05:46:57+05:30 IST