ఆటో కార్మికులకు అభయ హస్తం పింఛన్‌ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-05-20T05:52:35+05:30 IST

కొవిడ్‌ ప్రభావంతో ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఆ దుకునే విధంగా అభయహస్తం పేరుతో కనీసం రూ. 5వేల పింఛను ఇ వ్వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఆటో కార్మికులకు అభయ హస్తం పింఛన్‌ ఇవ్వాలి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

ఫిట్‌నెస్‌ రెన్యూవల్‌ పెనాల్టిని తక్షణమే నిలిపివేయాలి

ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

జగిత్యాల టౌన్‌, మే 19 : కొవిడ్‌ ప్రభావంతో ఆటో కార్మికుల పరిస్థితి దయనీయంగా మారిందని తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం కార్మికులను ఆ దుకునే విధంగా అభయహస్తం పేరుతో కనీసం రూ. 5వేల పింఛను ఇ వ్వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. జిల్లా కేంద్రంలోని ఇం దిరా భవన్‌లో గురువారం ఎమ్మెల్సీ విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదలు ఎక్కువగా మోటార్‌ రంగంపై ఆధారపడి ఉపాధి పొందుతున్నారన్నారు. క్రుడాయిల్‌ ధరలు స్థిరంగా ఉన్నప్పటికి పెట్రోల్‌, డిజీల్‌ ధరలు పెరగడంతో రవాణా రం గం పూర్తిగా కుదేలైందని ముఖ్యంగా ఆటో కార్మికులపై భారం పెరిం గందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం ఆటోలకు ఇన్యూరె న్స్‌ రూ. 3 వేల నుంచిరూ. 9 వేలకు, గ్రీన్‌ టాక్స్‌ రూ. 250 నుంచి రూ. 2500, రిజిస్ట్రేషన్‌ చార్జీలు రూ. 600 నుంచి రూ. 3500 పెరగడం తో ఆటో కార్మికులు ఉపాధి కోల్పోవాల్సిన పరిస్థితి ఎదురైందన్నారు.  లోటు బడ్జెట్‌ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఆటో కార్మికులకు అక్కడి ప్రభుత్వం ఏడాదికి రూ. 10 వేలు ప్రొత్సాహకం అందించి అండగా ని లుస్తోందన్నారు. వాహనాల ఫిట్‌నెస్‌పై రోజుకు రూ. 50 పెనాల్టీ విధిం చడాన్ని పుర్తిగా తప్పుబట్టారు. తక్షణమే ఫెనాల్టీని రద్దు చేయాలని డి మాండ్‌ చేశారు. ఈ సమావేశంలో టీపీసీసీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ బండ శంకర్‌, పీసీసీ సభ్యుడు గిరి నాగభూషణం, నాయకులు గాజుల రాజేం దర్‌, పుప్పాల ఆశోక్‌, మన్సూర్‌, రమేష్‌, చాంద్‌ పాష, దుర్గయ్య, మహిపాల్‌ ఉన్నారు.

Updated Date - 2022-05-20T05:52:35+05:30 IST