నియోజకవర్గానికి స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలి

ABN , First Publish Date - 2022-03-16T05:45:15+05:30 IST

పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులకు భారాన్ని తగ్గించేందుకు నియో జకవర్గానికి ఒక స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి చింత అనిల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

నియోజకవర్గానికి స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలి
కలెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలుపుతున్న బీజేవైయం నాయకులు

బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి చింత అనిల్‌ 

జగిత్యాల అర్బన్‌, మార్చి 15: పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే బడుగు, బలహీన వర్గాల అభ్యర్థులకు భారాన్ని తగ్గించేందుకు నియో జకవర్గానికి ఒక స్టడీ సర్కిల్‌ ఏర్పాటు చేయాలని బీజేవైయం జిల్లా ప్రధాన కార్యదర్శి చింత అనిల్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా క లెక్టరేట్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపి, జాయింట్‌ కలెక్టర్‌ బి యస్‌ లతను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో బీ జేవైయం నాయకులు గుర్రం రంజిత్‌ రెడ్డి, గంగాధర్‌ ఉన్నారు.   


Read more