కేంద్ర ప్రభుత్వ పాలనకు గుణపాఠం తప్పదు

ABN , First Publish Date - 2022-10-08T05:28:50+05:30 IST

దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వ పాలనకు గుణపాఠం తప్పదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్‌ అన్నారు.

కేంద్ర ప్రభుత్వ పాలనకు గుణపాఠం తప్పదు
మాట్లాడుతున్న మంత్రి ఈశ్వర్‌

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్‌

జగిత్యాల, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): దుర్మార్గమైన కేంద్ర ప్రభుత్వ పాలనకు గుణపాఠం తప్పదని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పల ఈశ్వర్‌ అన్నారు. పట్ట ణంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడా రు. మత విద్వేశాలను రెచ్చగొడుతూ దేశంలో ఒక అశాంతిని కొందరు సృష్టిం చడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు తెలంగాణకు చేసింది శూన్యమన్నారు. టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్పు చేయడానికి అవసరం వచ్చింది గనుకనే సీఎం కేసీఆర్‌ సరియైన నిర్ణయం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ నాయకత్వం ప్రస్తుత పరిస్థితిల్లో దేశానికి ఉందన్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న 24 గంటల విద్యుత్‌ సరాఫరా, రైతుబందు, దళిత బందు, ఇతర అనేక సంక్షేమ కార్యక్రమాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాల్సిన అవసరముం దన్నారు. గుజరాత్‌ను మోడల్‌గా చూపించి ప్రధాన మంత్రి అయిన నరేంద్ర మోదీ దేశాన్ని పరిపాలించడంలో ఘోరంగా విఫలమయ్యారన్నారు. గుజరాత్‌ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని పోల్చి చూస్తే అభివృద్ధి, సంక్షేమం ఇట్టే అర్థమవు తుందన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి వాటికి శాశ్వత పరిష్కారం చూపిం చే నాయకత్వ లక్షణాలు సీఎం కేసీఆర్‌కు ఉన్నాయన్నారు. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధి లక్ష్యాలుగా బీఆర్‌ఎస్‌ను ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్న సీఎం కేసీ ఆర్‌కు రాష్ట్ర ప్రజలు ఎప్పటిమాదిరిగానే అండదండలు అందించాలని కోరారు.  ఈ సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, జిల్లా గ్రంథాలయ అభి వృద్ధి సంస్థ చైర్మన్‌ గొల్లపల్లి చంద్రశేఖర్‌ గౌడ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ శ్రీకాంత్‌, గ్రంథాలయ అభివృద్ధి సంస్థ సభ్యులు భీమేశ్వరీ, డాక్టర్‌ ఉప్పుల నాగభూషణం  పాల్గొన్నారు.

Read more