రెండెకరాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-12-30T00:50:44+05:30 IST

జగిత్యాల-వరంగల్‌ జాతీయ రహదారి-563 నాలుగు వరుసల విస్తరణకు గాను చేపట్టనున్న భూ సేకరణకు భూ యజమానులతో గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించి న సమావేశంలో రెండు ఎకరాల భూమికి కోటీ రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని భూ యజమానులు డిమాండ్‌ చేశారు.

రెండెకరాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి
మాట్లాడుతున్న ఆర్డీవో

రెండెకరాలకు కోటి రూపాయల నష్టపరిహారం ఇవ్వాలి

భూ నిర్వాసితుల డిమాండ్‌

కొడిమ్యాల, డిసెంబరు 29 : జగిత్యాల-వరంగల్‌ జాతీయ రహదారి-563 నాలుగు వరుసల విస్తరణకు గాను చేపట్టనున్న భూ సేకరణకు భూ యజమానులతో గురువారం మండల పరిషత్‌ కార్యాలయంలో నిర్వహించి న సమావేశంలో రెండు ఎకరాల భూమికి కోటీ రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని భూ యజమానులు డిమాండ్‌ చేశారు. ఈ సమావేశానికి మండలంలోని నాచుపెల్లి, పూడూర్‌, గౌరాపూర్‌, నమిళికొండ, తురుకకా శీనగర్‌ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్బంగా మండలంలోని పూడూర్‌ గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో రైల్వే లైన్‌, వరద కాల్వ కోసం, ఎకరాల కొద్ది భూములను ప్రభుత్వానికి అప్పగించామన్నారు. అం తక ముందు ఆర్డీవో మాధురి మాట్లాడుతూ భూములు, ఇళ్ళు కోల్పోయిన వారు ఏమైనా అభ్యంతరాలు ఉంటె దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీపీ స్వర్ణలత, తహసీల్దార్‌ స్వర్ణ, కొడిమ్యాల, పూడూర్‌ సింగిల్‌ విండోల చైర్మనులు రాజనర్సింగరావు, రవీందర్‌రెడ్డ్డి, పూడూర్‌, అప్పారావుపేట గ్రామాల సర్పంచులు కవితరవికుమార్‌, మల్లేశముదిరాజు, ఉపాధ్యక్షుడు ప్రసాద్‌, మాజీ సర్పంచు రాంరెడ్డి, భూములు, ఇళ్ళు కోల్పోతున్న నాచుపెల్లి, పూడూర్‌, నమిళికొండ, తురుకకాశీనగర్‌ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Updated Date - 2022-12-30T00:50:44+05:30 IST

Read more