అభివృద్ధిలో వెనుకబడ్డ నియోజిక వర్గం

ABN , First Publish Date - 2022-12-07T00:05:06+05:30 IST

స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు ప్రజలకు అందుబాటులో లేక నియోజికవర్గం అభివృద్ధిలో వెనుకంజలో ఉందని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

అభివృద్ధిలో వెనుకబడ్డ నియోజిక వర్గం
పాదయాత్ర చేస్తున్న కాంగ్రెస్‌ నాయకులు

కాంగ్రెస్‌ నాయకులు పొన్నం ప్రభాకర్‌

మేడిపల్లి, డిసెంబర్‌ 6: స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు ప్రజలకు అందుబాటులో లేక నియోజికవర్గం అభివృద్ధిలో వెనుకంజలో ఉందని కాంగ్రెస్‌ నేత పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మేడిపల్లి మండలంలోని మోత్కురావుపేట నుం చిచందుర్తి వరకు రోడ్డు నిర్మాణ పనులు చేపట్టాలని కోరుతూ మంగళవారం భీ మారం గ్రామం నుంచిమోత్కురావుపేట వరకు పాదయాత్ర చేపట్టారు. రూ. 19.75 కోట్లు మంజూరు చేయించానని అన్నారు. 2017, డిసెంబర్‌ 5న పనుల ప్రారంభానికి మోత్కురావుపేట గ్రామంలో శిలాఫకం వేశారని తెలిపారు. అయి దేళ్లు గడిచినా ఇప్పటి వరకు రోడ్డు నిర్మాణం జరగలేదని అవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి మాట్లాడుతూ ఎమ్మెల్యే స్థానికంగా ఉండక పోవడంతో ని యోజక వర్గం అభివృద్ధికి దూరమైందన్నారు. ఆది శ్రీనివాస్‌ మాట్లడుతూ ఎక్కడో ఖమ్మం జిల్లా లో సీతమ్మ ప్రాజెక్టుకు మేడిపల్లి, కథలాపూర్‌ మండలాల్లోని పేద రైతులకు చెందాల్సిన ప్రభుత్వం, ప్రైవేటు భూములను ఇవ్వడం ఏంటీ అని ప్ర శ్నించారు. మేడిపల్లి మండలం అన్ని రంగాల్లో వెనుబడి పోయిందని అభివృద్ధి చే సేంతవరకు తన ఆందోళను కోనసాగిస్తానని అన్నారు. కాంగ్రెస్‌ నాయకులు సిం గిరెడ్డి నరేష్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, లచ్చానాయక్‌, విజయ్‌, కొమురయ్య, నర్సయ్య, స య్యద్‌, ముజావిద్‌, మల్లేషం, గంగధర్‌, జలందర్‌రెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2022-12-07T00:05:08+05:30 IST