ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

ABN , First Publish Date - 2022-12-16T00:42:44+05:30 IST

ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

ఆర్థిక ఇబ్బందులతో యువకుడి ఆత్మహత్య

దుండిగల్‌, డిసెంబర్‌ 15 (ఆంధ్రజ్యోతి): ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. సూరారం కాలనీ వెంకటరమణ నగర్‌, సాయితేజ ఎన్‌క్లేవ్‌ ఫ్లాట్‌నెంబరు 204లో నివసిస్తున్న అంబటి అశోక్‌కుమార్‌ కుమారుడు అజయ్‌కుమార్‌(29) ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితుల వల్ల మద్యానికి బానిసయ్యాడు. ఈనెల 14వ తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. తల్లిదండ్రులు తలుపులు కొట్టినా తీయకపోవడంతో పగులగొట్టి చూడగా అజయ్‌కుమార్‌ చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఉన్నాడు. కిందకు దించి 108కు కాల్‌ చేశారు. అంబులెన్స్‌ సిబ్బంది వచ్చి పరిశీలించి మృతి చెందినట్లు నిర్ధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు దుండిగల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2022-12-16T00:42:45+05:30 IST